బాబు వెంట్రుక కూడా పీకలేడు, టిడిపి నేతనే షాకిచ్చాడు: అరిచిన జగన్

విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ చింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

టిడిపి నేతనే తీర్మానం చేయలేదు!: జగన్

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి వెంకటరమణ బాక్సైట్ తవ్వకాల గురించి తీర్మానం చేశారా చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. స్వయంగా టిడిపి నేత వెంకటరమణనే తీర్మానం చేయలేదన్నారు. కానీ చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలపై గ్రామ సభల్లో తీర్మానం జరిగిందని చెప్పడం విడ్డూరమన్నారు.

ఈ బాక్సైట్ మాకు వద్దని లక్షలాది మంది గట్టిగా చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్ఞానోదయం కావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలు వద్దని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఆయన యూ టర్న్ తీసుకున్నారన్నారు.

ys jagan holds meeting in chintapalli against bauxite mining

ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ ఎందుకు వేయలేదంటే..

రాష్ట్రంలోని ఏడుగురు మన్యం ఎమ్మెల్యేల్లో ఆరుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాల పైన ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ వేయాల్సి ఉంటుందన్నారు. అయితే దానిని ప్రభుత్వం వేయడం లేదన్నారు.

దానికి కారణం ఉందని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ వేస్తే ముప్పావు శాతం మంది ట్రైబల్ ప్రజాప్రతినిధులు ఉండవలసి ఉంటుందని, ఏడుగురిలో ఆరుగురు వైసిపి వారే ఉన్నందున.. మన పార్టీ వారే ఎక్కువ ఉంటారని, ఆ భయంతోనే ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ వేయలేదన్నారు.

బాక్సైట్‌కు అనుకూలంగా ఎలాంటి తీర్మానాలు చేయలేదని స్థానికులు చెబుతున్నారని జగన్ అన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా లక్షల గొంతులు ఏకమయ్యాయని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఆరేళ్లవుతున్నప్పటికీ.. చంద్రబాబు బాక్సైట్ తవ్వకాల విషయంలో ఆయనను తప్పుపడుతున్నారన్నారు.

వైయస్ అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా.. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, అప్పుడే వారి గుండెల్లో స్థానం కల్పించుకుంటారన్నారు. ఒకవేళ బాక్సైట్ తవ్వకాలు జరిపితే గిరిజనులకే అప్పగించాలని చట్టం ఉందన్నారు.

చంద్రబాబు 2000 సంవత్సరంలోనే ట్రైబల్ అడ్వయిజరీ కమిటీ వేయించారని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలనుకుంటే వైయస్ రాజశేఖర రెడ్డి నాడే చేసేవారని, కానీ గిరిజనుల మనోభావాల ప్రకారం నడుచుకున్నారని చెప్పారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్లేటు మార్చారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తవ్వకాలు జరుపుతామంటాడని, విపక్షంలో ఉన్నప్పుడు వద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు.

చింతపల్లి మార్కెట్ కమిటీకి డైరెక్టర్‌గా ఉన్న టిడిపి నేత వెంకటరమణ బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారని, కానీ చంద్రబాబు మాత్రం శ్వేతపత్రంలో గ్రామ సభలు తవ్వకాలకు అంగీకరించాయని చెబుతున్నారని ఆరోపించారు. నిజం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు.

చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో 97ను ఉపసంహరించుకోవాలన్నారు. కానీ ఆయన పక్కన పెట్టానని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బాక్సైట్ తవ్వకాలను ఉపసంహరించుకోవాలన్నారు.

బాక్సైట్ తవ్వకాల పైన గ్రామసభలను ఎందుకు నిర్వహించడం లేదని, అలాగే ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఎందుకు వేయడం లేదన్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీలో మూడో వంతు గిరిజనులే ఉండాలని, అందుకే దానిని వేయడం లేదన్నారు. 2015లో చంద్రబాబు తవ్వకాల కోసం కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు రాశారన్నారు.

చంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం అనే మూడు పదాల పైన సాగుతోందన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రైతు, డ్వాక్రా సంఘాల రుణాలు చేస్తానని చెప్పారని, ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని కానీ వాటిని నెరవేర్చడం లేదని అరిచి మరీ చెప్పారు.

చంద్రబాబు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కటైనా నెరవేర్చారా చెప్పాలని గట్టిగా అరుస్తూ సభికులను ప్రశ్నించారు. దేశంలో చంద్రబాబు అంతటి మోసగాడు లేడన్నారు. బాక్సైట్‌లో భాగం ఇచ్చినప్పటికీ ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలనివ్వమని మండిపడ్డారు. మనం అందరం కలిసి కట్టుగా ఉంటే చంద్రబాబు మన వెంట్రుక కూడా పీకలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+