వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలు చంద్రబాబు ఏం చేశారు: జగన్‌తో విద్యార్థులు, ఒక్కొక్కరి ఆగ్రహం ఇలా..

|
Google Oneindia TeluguNews

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఏలూరు యువభేరీ సభలో తన ప్రసంగం అనంతరం విద్యార్థులతో మాటామంతి జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్యమంత్రి, టిడిపి పైన దుమ్మెత్తిపోశారు.

సింగపూర్‌కు రాజధానిని అప్పగిస్తారా?

రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు అప్పగించడం ఏమిటని ఓ విద్యార్థిని ప్రశ్నించింది. దీనిపై జగన్ స్పందిస్తూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఇంజినీర్లు మనదేశంలో పుట్టారని, అలాంటి ఇంజినీర్లు పుట్టిన ఈ దేశాన్ని కాదని చంద్రబాబు సింగపూర్ వెంట పడ్డారన్నారు. ఆయన దోచుకోవడానికే ఇలా చేస్తున్నారని జగన్ అన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇచ్చారా?: శ్వేత

ముఖ్యమంత్రి చంద్రబాబు యువతకు ఇచ్చిన అతిపెద్ద హామీ గురించి తాను మాట్లాడుతున్నానని. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారని, అలాంటప్పుడు ఇలాంటి సీఎం అవసరమా అనే శ్వేత అనే ఎంబీయే విద్యార్థిని ప్రశ్నించింది. దీనిపై జగన్ మాట్లాడుతూ.. మీలాంటి వాళ్లు ఇలా ప్రశ్నిస్తే కొద్దో గొప్పో రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. హామీల పైన నాయకులను ఇలా నిలదీసినప్పుడే ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలు ఇవ్వడానికి వెనుకాడుతారన్నారు.

చంద్రబాబు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు: ఆయేషా

అయేషా అనే టీచర్ ట్రెయినింగ్ అమ్మాయి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజాధనాన్ని దోచి విదేశీ పర్యటనలు చేపట్టారని, విదేశీ పెట్టుబడులతో ఎన్ని పరిశ్రమలు స్థాపించారని ఆమె నిలదీశారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేక విమానంలో తప్ప మామూలు విమానంలో తిరగరన్నారు. ఆయన తిరిగే ఖర్చులు ప్రభుత్వంలో పెట్టినా బాగుండేదన్నారు. గత రెండున్నరేళ్లలో బాబు పరిశ్రమల అభివృద్ధి కోసం ఆయన చేసిన దానిని గమనిస్తే ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. చెవుల్లో క్లారీఫ్లవర్లు పెట్టడంలో చంద్రబాబు గొప్పవ్యక్తి అన్నారు. చంద్రబాబును చూసి ఉద్యోగాలు రావని, ప్రత్యేక హోదా వల్లే వస్తాయన్నారు. ఓటుకు నోటు కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మకుండా నిలదీయాలన్నారు.

24-ys-jagan-latest-601

హామీలు ఇచ్చి నెరవేర్చకుంటే శిక్షించే చట్టం రావాలి: విద్యార్థి

మరో విద్యార్థి మాట్లాడుతూ.. రెండేళ్లుగా హోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు ప్యాకేజీ ఇస్తామని చెబితే ఊరుకోమన్నారు. హోదా ఎవడబ్బ సొత్తు కాదని అన్నారు. ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజలకు విలువ ఇవ్వరా అని నిలదీశారు. ప్యాకేజీతో నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ.. ఇలా అన్ని చేస్తారా అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు పరచకుంటే వారిని శిక్షించే చట్టం రావాలన్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ... ఇలాంటి వారిని బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని, హోదా కోసం నిలదీద్దామన్నారు.

హోదాపై పోరాటం ఏది: భరత్

భరత్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. హోదా కోసం పోరాటం చేయరా అని ప్రశ్నించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. హోదా కావాలని చెప్పింది, పోరాటం చేస్తామని చెప్పింది చంద్రబాబు అని అన్నారు. పోరాటం చేయాల్సిన చంద్రబాబు ఇప్పుడు చేయడం లేదన్నారు. ఆయన చేయాల్సిన పోరాటం మనం చేస్తుంటే కేసులు పెడుతున్నారన్నారు. బంద్ పిలుపు మనమిస్తే చంద్రబాబు భగ్నం చేసే ప్రయత్నం చేశారన్నారు.

అలాంటి రీయింబర్సుమెంట్స్ ఏవి: మౌనిక

మౌనిక అనే అమ్మాయి మాట్లాడుతూ.. వైయస్‌లా ఎలాంటి షరతులు లేకుండా ఇప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్సు ఇస్తుందా అని ప్రశ్నించారు. దానిపై జగన్ మాట్లాడుతూ.. వైయస్ ప్రవేశ పెట్టిన మంచి పథకాల్లో ఫీజు రీయింబర్సుమెంట్స్ ఒకటి అన్నారు. చంద్రబాబు అలా ఇవ్వడం లేదని లెక్కలు చెప్పారు. ఫీజు రీయింబర్సుమెంట్‌ను ఉద్యమంగా తీసుకెళ్దామన్నారు. నేను సీఎం అయితే పేదవాళ్లను ఉచితంగా చదివిస్తానన్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో, నా తండ్రి (వైయస్) ఫోటో ఉండేలా చేస్తానన్నారు.

ఓటును నోటులో ఇరుక్కొని మా జీవితాలతో చెలగాటం: అఖిల

అఖిల అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తనను తాను రక్షించుకోవడానికి తమ జీవితాలతో చెలగాడం ఆడుతోందని మండిపడ్డారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. దీనికి చంద్రబాబు తగిన శిక్ష అనుభవిస్తారన్నారు.

హోదా అంటే ఏమిటి: సూర్యనారాయణ

సూర్యనారాయణ అనే విద్యార్థి మాట్లాడుతూ... హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం చెప్పిందని అంటున్నారని, అసలు ఆర్థిక సంఘం అంటే ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై జగన్ వివరించారు.

వారికి ఇల్లు ఇచ్చి, మనకు ఏమీ ఇవ్వలేదు: సురేష్

సురేష్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. అన్నాదమ్ముల్లను విడదీసినట్లు విభజన చేశారని, మనకు రూపాయి ఇవ్వకుండా విభజన చేశారన్నారు. ఒకరికి (తెలంగాణ)కు ఇల్లు ఇచ్చి, మనకు ఏదీ ఇవ్వలేదన్నారు. హుధుద్ తుఫాను, విశాఖ రైల్వే జోన్.. ఇలా ఏదీ ఇవ్వలేదన్నారు. అలాంటప్పుడు ఇస్తామన్న దాని గురించి ఎలా నమ్మాలన్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. మీరు అడిగే దానితోనైనా బాబు మారుతారేమో అన్నారు.

హోదా కోసం ఏం చేద్దాం: సమీరా

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిందని, అంతకుమించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పిందని, అసలు హోదాతో వచ్చే లాభాలను ప్యాకేజీతో ఎలా లెక్క కడుతుందని, రాష్ట్రం ఎలా స్వాగతిస్తుందని సమీరా అనే విద్యార్థిని ప్రశ్నించారు. హోదా సాధనకై విద్యార్థులకు మీరేం చెబుతారు, మీరేం చేస్తారు, విద్యార్థులుగా మమ్మల్ని ఏం చేయమంటారని ప్రశ్నించారు. దానిపై జగన్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే వారు ఇస్తున్నారని, వాటికే ప్యాకేజీ అని పేరు పెడుతున్నారని చెప్పారు. దానికి చంద్రబాబు మద్దతు పలుకుతున్నారన్నారు. హోదా వస్తే మీరే (విద్యార్థులు) చాలామందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చన్నారు. హోదా కోసం అందరం పోరాడుదామన్నారు. ప్రత్యేక తెలంగాణ అసాధ్యమనుకున్నారని, అలాంటిది సాధించారని, ఇక పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా సాధించలేమా అన్నారు. టైం పట్టవచ్చు కానీ వస్తుందన్నారు.

పార్లమెంటు ఓ గుడి, మసీదు, చర్చి: సయ్యద్ అర్షద్ అలీ

సయ్యద్ అర్షద్ అలీ అనే విద్యార్థి మాట్లాడుతూ.. పార్లమెంటు ఓ గుడి, మసీదు, చర్చి అని, అలాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుంటే ఎలా అన్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి అబద్దాలు చెప్పినందుకు మనమంతా సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

English summary
YSRCP chief YS Jagan interact with student in Eluru Yuva Bheri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X