ఇది దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనిది: వైఎస్ జగన్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సామాజిక సాధికార యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు రంగంలోకి దిగిన మంత్రులు ప్రజలకు సామాజిక సాధికారత గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సీఎం జగన్ సామాజిక సాధికార యాత్ర పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
వైసిపి ప్రభుత్వంలో సామాజిక సాధికారత సాధ్యమైందని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా జరగలేదన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది అంటూ వ్యాఖ్యానించారు.

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించిందని వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనం అని ఆయన స్పష్టం చేశారు. చట్టం చేసి నామినేటెడ్ పదవుల్లో 50శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టంకట్టిన ప్రభుత్వం కూడా మనదేనని ఆయన గర్వంగా చెప్పారు.
పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందని పేర్కొన్న ఆయన ఆ యుద్ధంలో పేదలే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతా కలిసి కట్టగట్టుకుని వచ్చినా సరే విజయం సాధించేది పేదలే కావాలన్నారు.
మన ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిది. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించింది. 53నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం… pic.twitter.com/kcj6CkhDOE
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2023
ఈరోజు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "సామాజిక సాధికార యాత్ర'' ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార యాత్ర ద్వారా పేదవాడి విజయానికి బాటలు వేయాలన్నారు వైయస్ జగన్.
-
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్











Click it and Unblock the Notifications