ఆ విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ ఆదర్శం: నారా లోకేష్

యువ గళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువ గళం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న లోకేష్ తనదైన శైలిలో స్థానిక ఎమ్మెల్యే లను టార్గెట్ చేస్తున్నారు. వారు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఏకరువు పెడుతూ ప్రజలను తెలుగుదేశం పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్ వైసీపీ ఎమ్మెల్యే లు కొండలు, గుట్టలు మింగేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో యాత్ర చేస్తున్న నారా లోకేష్ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై భూకబ్జాల ఆరోపణలు చేశారు. ఇక ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని సైతం టార్గెట్ చేశారు.

వైసిపి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చెర్లకొత్తూరులో దళితుల భూములను ఆక్రమించారని, కొండలు, గుట్టలను సైతం మింగేస్తున్నారంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. స్థానికులు ఇచ్చిన ఆధారాల ప్రకారం చెర్ల కొత్తూరులో దళితుల భూములను ఎమ్మెల్యే శ్రీదేవి ఆక్రమించారని, దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను విడుదల చేశారు.

lokeshjagan

ఇదిలా ఉంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సైతం టార్గెట్ చేసిన లోకేష్ సహజ వనరుల దోపిడీలో జగన్మోహన్రెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. రుషికొండ కు జగన్ గుండు కొడితే ఉండవల్లి కొండను ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏకంగా మింగేశారని లోకేష్ మండిపడ్డారు.

ఉండవల్లి కొండలు మాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే ఆళ్ల మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందని లోకేష్ విమర్శించారు. గ్రావెల్ దోపిడీని బయటపెట్టిన మంగళగిరి తెలుగుదేశం పార్టీ నేతలను అభినందిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+