Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సూత్రధారి వైఎస్ జగన్..? పాత్రధారి ఇంటూరి రవికిరణ్!: ‘పొలిటికల్ పంచ్’ వ్యవహారం

‘పొలిటికల్ పంచ్ ఫేస్ బుక్ పేజ్’ వ్యవహారం కాస్తా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మెడకు చుట్టుకుంది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నది వైఎస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికే అని పోలీ

అమరావతి: 'పొలిటికల్ పంచ్ పేజ్' వ్యవహారం కాస్తా వైఎస్ జగన్ మెడకు చుట్టుకుంది. ఈ పేజ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణలో వెల్లడైన విషయాలు పోలీసులనే బిత్తరపోయేలా చేశాయి. ఈ మొత్తం కథ వెనక ఉన్నది వైఎస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికే అని పోలీసులు చెబుతున్నారు.

వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అభ్యంతరం వ్యక్తం చేయని ఏపీ ప్రభుత్వం, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇది వరకే హెచ్చరించింది.

YS Jagan is behind Political Punch Facebook Page? AP Police suspects after investigation

అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేస్తున్న పొలిటికల్ పంచ్ అనే వైసీపీ అనుబంధ ఫేస్‌బుక్ పేజ్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ పేజ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

అతనిని విచారించిన పోలీసులు నివ్వెరపోయేలా నిజాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షిదినపత్రికకు అనుబంధంగా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడమే వీరి డ్యూటీ అని తెలిసింది.

ఈ టీమ్‌కు జగన్ మీడియా హౌస్ 'సాక్షి' నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా... మీడియాకు అనుబంధంగా సోషల్‌ మీడియా టీమ్స్‌ పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+