మన టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లకు గుర్తింపు-స్కూళ్లలో మరింతగా ఏఐ- జగన్ కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై సీఎం జగన్ ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ విద్యలో ఐబీ సిలబస్‌పై చర్చించారు. ప్రపంచస్థాయిలో విద్యాబోధనే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. ముందుగా విస్తృతంగా అధ్యయనం, కసరత్తు చేయాలన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు నెరవేర్చేలా, విద్యావ్యవస్థ అవసరాలను, విద్యార్థుల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ అధ్యయనం చేయాలన్నారు.
ఉపాధ్యాయుల సమర్థతను పెంచడం, సజావుగా బోధనచేసేలా ఏంచేయాలన్న దానిపై చర్చించాలన్నారు.
ఏపీ స్కూళ్లలో ఏఐలో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా ఇంటర్నేషనల్ అకడమిక్ కమ్యూనిటీలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వామ్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. పైలట్ పద్ధతిలో వివిధ సంస్థల కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది మరొక ప్రధాన అంశమన్నారు. అందుబాటులో ఉన్న ఏఐని వాడుకుని దాన్ని బోధనలో, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో వినియోగించుకోవాలన్నారు.

ఉన్న సబ్జెక్టులను మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి కూడా ఏఐని వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలన్నారు. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించడానికి ఏఐ వినియోగపడుతుందన్న సీఎం.. దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల విద్యలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందాలన్నారు.
ఏపీలో ఒక విద్యార్థి పదోతరగతి సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా.. విలువైనదిగా ఉండాలన్నదే లక్ష్యమని జగన్ తెలిపారు. శాస్త్రసాంకేతిక, ఆర్థిక, వ్యాపారం, ఇతర రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఉండాలన్నారు. గతంలో నాకన్నా ముందు ఒక ప్రభుత్వం ఉండేది కాని, ప్రభుత్వ స్కూళ్లను, విద్యార్థులను గాలికొదిలేసిందన్నారు. మనం వచ్చాక అనేక మార్పులు తీసుకొచ్చి, ప్రపంచంలో అన్ని అవకాశాలు పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు.

సాధారణ ఆలోచనలతో కాకుండా మెరుగైన ఆలోచనలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించే ప్రక్రియ కొనసాగాలని సీఎం జగన్ సూచించారు. నాయకులుగా ఉండే వ్యక్తులు మార్పులను స్వాగతిస్తూ, పేద విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించాలన్నారు. సులభంగా నేర్చుకునే విధానాన్ని, విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా, వారిలో సృజనాత్మకత పెంచేందుకు నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. అలాగే విద్యావిధానం జాబ్‌ఓరియెంటెడ్‌గా ఉండాలన్నారు. విద్యార్ధులు తాము నేర్చుకున్న థియరీ జీవితంలో ఏ మేరకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడుతుందో ప్రశ్నించేదిగా ప్రశ్నాపత్రాలు ఉండాలని ఆదేశించారు.
విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్గించాలన్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications