ఆదాయం ఇలా తీసుకురండి.. అధికారులకు జగన్ కీలక ఆదేశాలు..

ఆదాయార్జన శాఖలపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. దీనివల్ల సమర్థత పెరుగుతుందని, పన్నులుచెల్లించేవారికి సౌలభ్యంగా సేవలు అందుతాయన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వీటిని అధ్యయనం చేసి వచ్చే సమీక్షా సమావేశంలో తనకు నివేదించాలని జగన్ ఆదేశించారు.

గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య పన్నుల ఆదాయ వృద్ధిలో ఏపీ మెరుగైన పనితీరు కనబరిచినట్లు అధికారులు సీం జగన్ కు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల కంటే మెరుగైన స్థానంలో ఏపీ ఉందన్నారు. గత ఏడాదితో పోలిస్తే కర్ణాటకలో 27.51శాతం, మహారాష్ట్రలో 24.4 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 25.29శాతం వృద్ధి ఉందన్నారు. యంత్రాంగంలో సరైన విధానాలను అమలు చేయడంద్వారా సమర్థత గణనీయంగా పెరుగుతుందని, దీనివల్ల లీకేజీలు అరికట్టడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు చక్కటి సేవలు అందుతాయని, తద్వారా ఆదాయాలు పెరుగుతాయని సీఎం జగన్ తెలిపారు.

 jagan-

స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం వృద్ది చెందినట్టుగా అధికారులు సీఎంకు వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఇది క్రమంగా పెరుగుతూ వస్తుందన్నారు. 2018-19లో ఈ శాఖ ఆదాయం రూ.4725 కోట్లు కాగా, 2022-23 నాటికి రూ.8071కోట్లకు చేరింది.రిజిస్ట్రేషన్లు, టౌన్ ప్లానింగ్‌ విభాగాలు, మండల కార్యాలయాలు, గ్రామవార్డు సచివాలయాలు సహా ఇతర చోట్లకూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సేవలు అందించడంలో అత్యంత పారదర్శకత ఉండాలన్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలన్న దానిపై ఏసీబీ నంబర్లను ఆయా కార్యాలయాల్లో ప్రముఖంగా కనిపించేలా హోర్డింగ్స్ఉంచాలని సీఎం సూచించారు.

రాష్ట్రంలో బీరు, మద్యం వినియోగం తగ్గినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. 2018-19 తో పోలిస్తే 2022-23లో 12.61శాతం లిక్కర్‌ వినియోగం తగ్గినట్టుగా అధికారులు తెలిపారు. 2018-19లో 384.3 లక్షల కేసుల లిక్కర్ ను రాష్ట్రంలో వినియోగిస్తే.. 2022-2౩లో 335.9 లక్షల కేసుల లిక్కర్‌ వినియోగిస్తున్నట్టు తేలింది. అలాగే 2018-19లో 277.1 లక్షల కేసుల బీరును వినియోగిస్తే.., 2022-23లో 116.7 లక్షల కేసులు బీరు మాత్రమే వినియోగించినట్టు అధికారులు తెలిపారు. 2018-19తో పోలిస్తే 2022-23లో 57.87శాతం తక్కువగా బీరు వినియోగించినట్టు వెల్లడించారు.

 jagan-

మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్, మత్తుపదార్థాలను నివారించడానికి, వాటి పంపిణీని అడ్డుకోవడానికి అధికారులు గట్టి దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. యూనివర్శిటీలు, కాలేజీలు, విద్యాసంస్థల వద్ద కచ్చితంగా టోల్‌ ఫ్రీ నంబర్ ఉండేలా హోర్డింగ్ స్ఉంచాలన్నారు. డ్రగ్స్ నివారణ కార్యక్రమాలు, టోల్ ఫ్రీ నంబర్‌ పనితీరుపై ప్రతి జిల్లాలో ప్రతి 15 రోజులకోసారి మాక్ డ్రిల్‌ చేపట్టాలన్నారు. గనులు ఖనిజాల శాఖలో గత ఏడాదితో పోలిస్తే 26శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. అలాగే రవాణాశాఖలో మెరుగైన విధానాలు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+