YS Jagan: వైసీపీ నేతల అరెస్టులపై జగన్ ఫైర్-రిటైరైనా వదలనని డీజీపీకి వార్నింగ్- పాపం అనిత..!
ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఫైర్ అయ్యారు. మీకే అంత కోపం వస్తే.. నాకెంత కోపం రావాలి అన్నారు. అమ్మ విజయమ్మ కారు ప్రమాదంపై సిగ్గులేని రాతలు రాశారని జగన్ మండిపడ్డారు.
అమ్మ లెటర్ కూడా ఫేక్ అన్నారని, చివరికి వీళ్ల మోసాలు చూస అమ్మ నేరుగా వీడియో విడుదల చేశారన్నారు. ఫేక్ న్యూస్ రాస్తున్న టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని జగన్ ప్రశ్నించారు.
డీజీపీ లోకేష్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. కడప ఎస్పీకి తన భార్య ఫోన్ చేసిందని ఆంధ్రజ్యోతి రాసిందిని, మరి రాధాకృష్ణను బొక్కలో వేయండని జగన్ కోరారు. పోలీసులు సెల్యూట్ మూడు సింహాలకు కొట్టాలని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడం కించపరచడమే అవుతుంది తెలిపారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, మీరు చేసే పనులు పోలీస్ డిపార్ట్మెంట్ పరువుపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.

ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్ పై ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తామని హెచ్చరించారు. తమ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లు తిప్పితిప్పి కొడుతున్నారన్నారు. బోజనాలు పెట్టకుండా.. నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మహిళలు అని కూడా చూడకుండా, హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి వేధిస్తున్నారన్నారు. 101 మంది పై కేసులు పెట్టారని, ఈ వివరాలు ఆన్ లైన్ లో పెట్టడం లేదని, కోర్టులకు తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు.
ఇదే డీజీపీ తమ ప్రభుత్వంలో ఆర్టీసీ ఎండీ స్థానంలో మంచి పదవిలో ఉంచామని జగన్ గుర్తుచేశారు. పదవీ వ్యామోహం కోసం ఇంతలా దిగజారాలా డీజీపీ అని జగన్ ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ దిగజారిందని, అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారని జగన్ ఆక్షేపించారు. గత ప్రభుత్వంలో పోలీసులు పనిచేయడం లేదని ఆయన ఎలా అంటారన్నవారు. ఆయన కూడా పని చేశారా అని ప్రశ్నించారు. ఈయన సరిగ్గా పనిచేస్తే ఇన్ని హత్యలు, ఇన్ని దుర్మార్గాలు ఎందుకు జరుగుతాయని అడిగారు. మీ వ్యవహరశైలి ఇలాగే ఉంటే, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదన్నారు.
వన్ సైడ్ గా వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకోబోమని జగన్ పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి పోలీస్ పై ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నారు.జమిలి అంటున్నారని, ప్రభుత్వం మారుతుందని, రిటైర్డైనా వదిలేది లేదని వారిని హెచ్చరించారు. తిరుపతిలో ఉన్న సుబ్బారాయుడిని కూడా వదలబోమన్నారు. సప్తసముద్రాల అవతల ఉన్నా వదలను, అన్ని బయటకు తీస్తామన్నారు.రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పని కాదని, ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications