బాబుకు బుర్ర లేదనడానికి ఇదే నిదర్శనం: జగన్, ‘వెన్నుపోటు’లోనే అనుభవం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబునాయుడే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మరాల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబుకు బుర్రలేదనడానికి అనంతపురమే మంచి ఉదాహరణ అని జగన్ దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనను చూస్తున్నామని, ఇలాంటి మోసపూరిత నాయకుడు మనకు కావాలా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతీమాటా అబద్ధమని ఆరోపించారు.

మోసం చేసే నాయకుడు కావాలా?
‘బ్యాంకుల్లోని బంగారం బయటకు రావాలంటే బాబు రావాలి. రైతు రుణాలు మాఫీ అవ్వాలంటే బాబు రావాలి. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? పైగా వేలం అంటూ బ్యాంకుల నుంచి రైతుల ఇళ్లకు నోటీసులు వస్తున్నాయి. రుణమాఫీతో కనీసం వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు' అని జగన్ మండిపడ్డారు.

‘వెన్నుపోటు’లోనే బాబుకు అనుభవం
గత ఎన్నిక లప్రచారంలో అధికారంలోకి వస్తే రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని తాను చెబితే, రాజకీయాల్లో నేను సీనియర్ ను రూ. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాని చంద్రబాబు చెప్పారని... మరి ఇప్పుడేం చేశారని జగన్ ప్రశ్నించారు. వెన్నుపోటు రాజకీయ అనుభవం మాత్రమే చంద్రబాబుకు ఉందని జగన్ ఆరోపించారు. రైతుల నుంచి తక్కు వ ధరలకు పంటనుకొని హెరిటేజ్ ద్వారా ఎక్కువ ధరలకు బాబు అమ్ముకుంటున్నారని అన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు 8 నెలల నుంచి బిల్లులు రావడం లేదని అన్నారు.

బాబు పుణ్యాన పరాయి రాష్ట్రాలకు
చంద్రబాబు పుణ్యాన నాలుగు లక్షల మంది అనంతపురం జిల్లావాసులు బెంగళూరు, కేరళలకు వలసవెళుతున్నారని ఆరోపించారు. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోందని, నీళ్లు ఇస్తుంటే 63మండలాలను కరువు మండలాలుగా ప్రతియేటా ఎందుకు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు.

బాబుకు బుర్ర లేదనడానికి ఇదే నిదర్శనం
చంద్రబాబుకు బుర్రలేదనడానికి అనంతపురమే ఓ ఉదాహరణ అని అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్ 6వేల కోట్లతో దాదాపుగా పూర్తి చేశారని అన్నారు. ఒట్టి పిల్ల కాలువలను చంద్రబాబు తవ్వించే ఉంటే అనంతకు నీళ్లు అందేవని అన్నారు. కానీ, బాబు ఆ పని చేయరని అన్నారు. శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉంటాయని, పోతిరెడ్డిపాడు నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్‌ను నిర్మించాలన్న ఆలోచన దిక్కుమాలిన సీఎంకు రాదని అన్నారు. రైతులకు భరోసా ఇవ్వడానికే ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నానని చెప్పారు.

జగన్ భరోసా
‘ఈ పెట్టుబడులకు రైతులు బ్యాంకులు, ప్రైవేటు వడ్డీలపై ఆధారపడాల్సివస్తోంది. రైతన్న భరోసా పేరుతో పత్రి ఏటా మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 12 వేలు ఇస్తాం. ఒక ఎకరాలో వేసే వారికి 90 శాతం పెట్టుబడి వచ్చినట్లు అవుతుంది. మిగిలిన వారికి కాస్తో కూస్తో అండగా నిలుస్తుంది. రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తాం. ప్రతి రైతుకు వడ్డీ లేని పంట రుణాలను అందజేస్తాం.
మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్ధిరీకరణ నిధిని తీసుకువస్తాం. ఏ పంట ఏ ధరకు కొంటామో ముందే చెప్తాం. అదే రేటుకు ఎవరూ కొనకపోతే. ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేస్తుందని చెబుతున్నా. కోల్డ్ స్టోరేజిలు ఉచితంగా వాడుకునే ఏర్పాట్లు చేస్తాం' అని జగన్ హామీ ఇచ్చారు.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications