అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తరాంధ్ర వర్సెస్ అమరావతి- భావోద్వేగాల పోరు మొదలు-అసెంబ్లీలో శ్రీకారం చుట్టిన జగన్ !

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర వాసులు రాజధానిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో అమరావతి రైతులు అరసవిల్లికి పాదయాత్ర ప్రారంభించడం, దీనికి విపక్షాలన్నీ మద్దతిస్తుండటంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. అయితే దీనికి విరుగుడుగా భావోద్వేగాల పోరును వైసీపీ ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

 ఏపీలో రాజధానుల పోరు

ఏపీలో రాజధానుల పోరు

ఏపీలో మరోసారి రాజధానుల పోరు ప్రారంభమైంది. టీడీపీ హయాంలో అమల్లోకి వచ్చిన అమరావతి రాజధాని పనులు కొంతమేర సాగిన తర్వాత ప్రభుత్వం మారడంతో పరిస్ధితులు కూడా వేగంగా మారిపోయాయి. ఇప్పుడు వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని తెరపైకి తీసుకురావడమే కాదు, వాటిని అమల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో అమరావతి వర్సెస్ మరో రెండు రాజధానుల పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా అమరావతి వర్సెస్ ఉత్తరాంధ్ర పోరు కొనసాగుతోంది. దీంతో ఏపీలో రాజధానుల వ్యవహారం జాతీయ స్ధాయిలోనూ చర్చనీయాంశమవుతోంది.

 అమరావతి వర్సెస్ ఉత్తరాంధ్ర

అమరావతి వర్సెస్ ఉత్తరాంధ్ర


అమరావతిలో ఉన్న రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ రెండు ప్రాంతాల మధ్య చిచ్చు రేగుతోంది. తమ ప్రాంతంలో రాజధానిని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు పాదయాత్ర చేపట్టారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అరసవిల్లి దేవాలయానికి వారు చేపట్టిన పాదయాత్రతో ఉత్తరాంధ్రలో వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే అమరావతి నుంచి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తున్న విపక్షాలు కూడా పాదయాత్రకు మద్దతిస్తుండటంతో ఉత్తరాంధ్ర స్పందన కీలకంగా మారిపోయింది. దీంతో విపక్షాలకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలైపోతున్నాయి.

 అసెంబ్లీలో శ్రీకారం చుట్టిన జగన్

అసెంబ్లీలో శ్రీకారం చుట్టిన జగన్

ఉత్తరాంధ్రలోని అరసవిల్లికి అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై నిన్న అసెంబ్లీలో సెటైర్లు వేసిన సీఎం జగన్.. దానికి మద్దతుగా నిలుస్తున్న టీడీపీపైనా తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు ఉత్తరాంధ్ర దేవుడి దగ్గరకు వెళ్లి అమరావతి రైతులు ఏమని మొక్కుతారంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు భావోద్వేగాలు ఉండవా అని ప్రశ్నించారు. తద్వారా అమరావతి రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్రలో అడ్డుకోవాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లయింది. దీంతో ఇప్పుడు జగన్ వ్యాఖ్యలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది ?

ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది ?

అమరావతి పాదయాత్రపై ఇప్పటికే విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, నేతలు... ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకు భావోద్వేగాలు ఉండవా అంటూ వేస్తున్న ప్రశ్నలతో పరిస్ధితులు ఎలా మారబోతున్నాయన్న టెన్షన్ పెరుగుతోంది. ముఖ్యంగా అమరావతి పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించిన తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. అదే జరిగితే అప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అప్పుడు ప్రభుత్వం మేం శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ముందే చెప్పామని చెప్పి ఊరుకుంటుందా లేక పాదయాత్ర రద్దు చేయాలని హైకోర్టును కోరుతుందా అన్నది చూడాల్సి ఉంది.

English summary
ap cm ys jagan seems to be launched emotional fight between amaravati and northern andhra regions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X