Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jaganannaku Chebudam : 'జగనన్నకు చెబుదాం' ప్రారంభం-స్పందనకూ, దీనికీ తేడా చెప్పిన జగన్..

ఏపీలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం ఇవాళ మరో కొత్త వ్యవస్ధను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న స్పందనతో పాటు జగనన్నకు చెబుదాం పేరుతో మరో కొత్త వ్యవస్ధను అమల్లోకి తెచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ దీన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు మరింత మెరుగ్గా పరిష్కారం చూపించేందుకు వీలుగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

 jaganannakichebudham

తన పాదయాత్రలో ప్రతీ జిల్లాలో, ప్రతీ గ్రామంలో కనిపించిన సమస్యలకు పరిష్కారం చూసే దిశగా పాలన సాగించినట్లు సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో 90 నుంచి 95 శాతం సమస్యలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, ప్రభుత్వం న్యాయంగా ఉంటే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుందని భావించినట్లు జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉండి కూడా పథకాలకు పొందాలంటే జన్మభూమి కమిటీలు ఏ పార్టీ అని అడిగి వాటిని ఇచ్చేవారన్నారు. పెన్షన్ల నుంచి ఇళ్ల కేటాయింపుల వరకూ ఇదే పరిస్ధితి ఉండేదన్నారు.

ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. వివక్షకు తావులేని వ్యవస్ధ తీసుకురావాలని విప్లవాత్మక అడుగులు వేశామన్నారు. అందులో భాగంగానే స్పందన కార్యక్రమం అమలు చేశామన్నారు. స్పందన కంటే మెరుగ్గా ఉండేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. పథకాలకు అర్హత ఉన్నా రాకపోతే, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైనా, వ్యక్తిగత సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపేందుకే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కలెక్టర్ల నుంచి కమిషనర్ల వరకూ, సచివాలయాల వరకూ అందరినీ భాగస్వాముల్ని చేస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్లు జగన్ తెలిపారు. ఎక్కడైనా, ఏ సమస్య కైనా ప్రయత్నం చేసినా పని జరగని పరిస్దితి ఉంటే వాటికి పరిష్కారం చూపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఇదో మంచి వేదిక అవుతుందన్నారు. ఎక్కడా పరిష్కారం కాని సమస్యల్ని పరిష్కరించుకునేందుకు నేరుగా 1902కు ఫోన్ చేయాలని సూచించారు. మీరు చేసే ఫిర్యాదులు నేరుగా తన కార్యాలయానికే వస్తాయన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+