సజ్జల విషయంలో మారిన జగన్ నిర్ణయం..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నేతలు స్థానిక ఎన్నికల దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పంచాయితీల విలీనం.. జిల్లాల పునర్విభజన వంటి అంశాల పై నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగానూ నిర్ణయాల వేగం పెంచారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అప్రమత్తం అయ్యారు. పార్టీలో కీలక నియామకాల పైన కసరత్తు చేస్తున్నారు. ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పుల దిశగా సంకేతాలు ఇస్తున్నారు. జనవరి నుంచి బస్సు యాత్రకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో సజ్జల బాధ్యతలపై ఆసక్తి నెలకొంది.
మాజీ సీఎం జగన్ జనవరి నుంచి పార్టీకి పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఇందు కోసం గతంతో నిర్ణయించిన విధంగా కార్యకర్తలతో సమావేశాలకు షెడ్యూల్ సిద్దం అవుతోంది. ఇక, బస్సు యాత్ర ద్వారా ప్రతీ పార్లమెంట్ పరిధిలో కార్యకర్తలతో సమావేశం కావాలని జగన్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల, వైవీ, కొడాలి నాని, పేర్ని నాని, బొత్సా, కన్నబాబు వంటి నేతల బాధ్యతల పైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి పార్టీ వీడిన తరువాత జగన్ పక్కన ఈ నేతలు కీలకంగా మారారు. కొందరు సీనియర్లు పార్టీ వీడారు. ఇక.. ఇప్పుడు రీజనల్ నాయకత్వం పైన జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అదే విధంగా పార్టీ అధికార ప్రతినిధులు.. సమన్వయం కోసం కొత్త టీం కు రూప కల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీ నేతలు బొత్సా, కన్నబాబు, శైలజానాధ్, సతీష్ రెడ్డి, మేకపాటి విక్రమ్, అనంత వెంకట రామి రెడ్డి, కల్యాణి, మార్గాని భరత్ వంటి వారికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత సజ్జల పైన కొందరు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ - పార్టీ మధ్య సమన్వయంలో విఫలమయ్యారనే చర్చలు జరిగాయి. ఒక దశలో సజ్జల పార్టీ ప్రత్యక్ష వ్యవహారాల నుంచి తప్పుకుంటారని ప్రచారం సాగింది. అయితే, వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు.
దీంతో.. సజ్జల విషయంలో ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు జరగలేదు. కాగా.. కొంత కాలంగా తిరిగి సజ్జల పార్టీలో క్రియాశీలకంగా మారారు. కీలక అంశాల పైన స్పందిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సాయిరెడ్డి సైతం పరోక్షంగా జగన్ కోటరీ అంటూ సజ్జల పైనే విమర్శలు చేసినట్లు చర్చ ఉంది. కాగా.. ఇప్పుడు సజ్జల కీలకంగా తిరిగి వ్యవహరిస్తున్న తీరుతో జగన్ నిర్ణయం మారిందా, లేక త్వరలో జరిగే నేతల బాధ్యతల మార్పుల్లో సజ్జల పైనా నిర్ణయం ఉంటుందా అనేది పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications