బొత్సాకు బంపరాఫర్ - జగన్ కంటే పెద్ద హోదా..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖాయమైంది. మాజీ మంత్రి బొత్సా ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది.శాసన మండలి లో వైసీపీకే ప్రస్తుతం మెజార్టీ ఉంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ మండలిలో తమ పట్టు నిరూపించోవాలని భావిస్తోంది. అందులో భాగంగా మండలిలో ప్రతిపక్ష నేత హోదా ప్రస్తుతం ఉన్న నేతను మార్చి బొత్సాకు ఇస్తారని తెలుస్తోంది.

బొత్సా లాంఛనమే
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సా ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. అనేక తర్జన భర్జనల తరువాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించింది. స్వతంత్ర అభ్యర్ది మాత్రమే ప్రస్తుతం బొత్సాకు పోటీగా నామినేషన్ దాఖలు చేసారు. బొత్సా ఎమ్మెల్సీగా గెలిస్తే మూడున్నారేళ్లు ఎమ్మెల్సీగా ఉండనున్నారు. గెలిస్తే బొత్సాకు శాసనమండలిలొ ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వైసీపీకి మండలిలో మెజారిటీ ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి లేళ్ల అప్పిరెడ్డి అపోజిషన్ లీడర్ గా ఉన్నారు.

YS Jagan likely to appoint Botsa as opposition leader in Council as Reports

మండలిలో పదవి
బొత్స గెలిస్తే ఆయనకే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసనమండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారు అని జగన్ అంచనాగా ఉంది. అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సీనియర్లు ఉన్నా..అప్పిరెడ్డికి ఇవ్వటం ఏంటనే చర్చ ఉంది. ఇదే సమయంలో విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అనూహ్యంగా బొత్సా ను అభ్యర్దిగా ఖరారు చేసారు. ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కూటమికి సంఖ్య బలం లేకపోవటంతో చివరకు పోటీ నుంచి తప్పుకుంది.

జగన్ వ్యూహం
అసెంబ్లీలో 11సీట్లకే పరిమితం కావటంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు బొత్సాకు మండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం ద్వారా జగన్ కంటే ప్రోటోకాల్..హోదాలో బొత్సాకు ప్రాధాన్యత దక్కనుంది. అదే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లులు..అంశాల పైన చర్చల్లో సీనియర్ నేతగా బొత్సా కీలక పాత్ర పోషించనున్నారు. మండలి సభ్యులు కూటమి వైపు చూడకుండా వ్యవహరించటంలో బొత్సాకు జగన్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో, బొత్సా ఎమ్మెల్సీగా ఎన్నిక ప్రకటన తరువాత..జగన్ తన నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+