బాబుకి హెచ్చరిక: కెసిఆర్ దార్లో నరుక్కొస్తున్నజగన్! ర్యాంక్ వెనుక కుట్ర (పిక్చర్స్)
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం ఆయన విశాఖలో యువభేరీ నిర్వహించారు.
ప్రత్యేక హోదా అంశంపై జగన్ విద్యార్థులతో మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యువభేరీ సదస్సు వేదిక నుంచి చంద్రబాబు సర్కారుకు గట్టి హెచ్చరిక చేశారు.
జగన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ ఉద్యమం దారిలో నడుస్తున్నట్లుగా అర్థమవుతోందంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఓయు, కెయు పాత్ర ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఇప్పుడు జగన్ కూడా హోదా కోసం విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని... చంద్రబాబు ప్రభుత్వంపై హోదా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమంలోకి విద్యార్థులను పురిగొల్పుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తేనే దేశంలో రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలుస్తుందని, దానిని సాధించేందుకు యువత నడుం బిగించాలని ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత జగన్ అన్నారు. యువత కదిలితే హోదా సాధన పెద్ద కష్టమేమీ కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా మంగళవారం విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో విద్యార్థులతో యువభేరి సదస్సు నిర్వహించారు.

ప్రత్యేక హోదా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై వైసిపి ఇప్పటి వరకూ చేసిన ఆందోళనల వల్ల ప్రజల్లో దానిపై అవగాహన ఏర్పడిందని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి లాభమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిసినా, ఓటుకు నోటు కేసుల్లో పీకల్లోతు ఇరుక్కునందున, దానిని ఎక్కడ తిరగదోడుతారోనన్న భయంతో ఆయన కేంద్రంపై వత్తిడి తేవడం లేదన్నారు.

ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదా వస్తే కేంద్రం, రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో 90 శాతం మొత్తాన్ని తిరిగి చెల్లించనక్కర్లేదన్నారు. ఎక్సైజ్, ఇన్‌కమ్ టాక్స్‌ల్లో 100 శాతం రాయితీ లభిస్తుందని చెప్పారు. ఆర్థిక సంఘానికి, హోదాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వివరించారు. కేవలం క్యాబినెట్ నిర్ణయంతోనే హోదా ఇచ్చేయవచ్చన్నారు.

ప్రత్యేక హోదా
ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వలన రెండు వేల పరిశ్రమలు వచ్చాయని, 490 శాతం ఉపాధి పెరిగిందని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌కు హోదా ఇవ్వడం వలన 10 వేల పరిశ్రమలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారన్నారు. చదువు పూర్తయ్యాక విద్యార్థులు హైదరాబాదుకు వెళ్లి ఉద్యోగం వెతుక్కుంటారన్నారు.

ప్రత్యేక హోదా
90 శాతం ఉద్యోగాలు హైదరాబాదులోనే ఉంటాయన్నారు. హైదరాబాదు తెలంగాణకు వెళ్లడం వల్ల... ఏపీకి అన్యాయం జరుగుతోందని, అందుకే మీకు ప్రత్యేక హోదా ఇస్తామని యూపిఏ ప్రభుత్వం, బిజెపి చెప్పాయన్నారు. విభజన సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్లమెంటులో ఉందని, టిడిపి ఓటు వేసి రాష్ట్రాన్ని విడగొట్టించారన్నారు. ప్రత్యేక హోదా హామీతో రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పారు. ఐదేళ్లు హోదా అని కాంగ్రెస్ అంటే, బిజెపి పదేళ్లు అని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్నారు.

ప్రత్యేక హోదా
హైదరాబాద్ పక్క రాష్ట్రానికి పోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారన్నారు. చదువుకున్న ప్రతి విద్యార్థికి సంజీవినిలా కనిపించేది ప్రత్యేక హోదా అన్నారు. చంద్రబాబు ఏనాడు విద్యార్థుల గురించి, యువత గురించి ఆలోచించలేదన్నారు. గతంలో సమైక్య పాలనలో చంద్రబాబు 42 ప్రభుత్వ సంస్థలను మూసివేశారని మండిపడ్డారు. ఇప్పుడు అవకాశమొస్తే... చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలను దివాళా తీయించి, అమ్మేసే ప్రయత్నాలు చేస్తారన్నారు.

ప్రత్యేక హోదా
వర్సిటీల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ చంద్రబాబు వాటిని నింపే ప్రయత్నం చేయడం లేదన్నారు. కారణం... ఆ వర్సిటీ దివాళా తీసి, మూతబడితే ప్రయివేటు విశ్వవిద్యాలయం తీసుకు వచ్చేందుకే అన్నారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారన్నారు.

ప్రత్యేక హోదా
ప్రయివేటు విశ్వవిద్యాలయాలు వస్తే ఫీజు రీయింబర్సుమెంట్స్ కూడా ఉండవన్నారు. సరే, ప్రయివేటు వర్సిటీలు తీసుకు వస్తే.. ఫీజు రీయింబర్సుమెంట్స్ దేవుడు ఎరుగు కనీసం, స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ ఉంటుందా అనేది చంద్రబాబు చెప్పాలన్నారు. యూనివర్సిటీల్లో అయిదువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

ప్రత్యేక హోదా
మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదని, ప్రత్యేక హోదా వస్తే ఏపీనే నెంబర్ వన్ అవుతుందన్నారు. ప్రత్యేక హోదాతో మనకు కేంద్రం ఇచ్చే వాటిలో 90 శాతం గ్రాంట్స్ ఉంటాయన్నారు. చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరని, అలాగే, ఉద్యోగాలు ఇచ్చే హోదా కోసం పోరాటం చేయరన్నారు. చంద్రబాబు మనిషేనా అనిపిస్తోంది, ఓటుకు నోటు భయంతోనే ఒక్కోసారి చంద్రబాబును చూస్తుంటే మనిషేనా అనిపిస్తోందన్నారు.

ప్రత్యేక హోదా
ప్రత్యేక హోదాపై చంద్రబాబు పోరాడకపోవడానికి కారణం ఓటుకు నోటు అని అభిప్రాయపడ్డారు. పట్టిసీమ నుంచి ఇసుక, మట్టి, మద్యం వరకు అన్నింటా లంచాలు తీసుకుంటున్నారన్నారు. అవన్నీ చంద్రబాబుకు అందుతున్నాయని, లంచాల ద్వారా వచ్చిన డబ్బుతో పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎమ్మెల్సీని గెలిపించేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారన్నారు.

ప్రత్యేక హోదా
వీడియో, ఆడియో టేపులతో ఆయన దొరికిపోయారన్నారు. ఈ విషయమై ఈ మధ్య చంద్రబాబును పదేపదే టీవీల్లో చూస్తున్నామన్నారు. అందుకే ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడరన్నారు. హోదా గురించి మాట్లాడేతే బిజెపి ఓటుకు నోటు అంశంపై కీ ఇస్తుందన్నారు.

ప్రత్యేక హోదా
నాడు తన పైన కూడా ఇలాంటి కాంగ్రెస్, టిడిపిలు కలిసి తప్పుడు కేసులు పెట్టాయన్నారు. వైయస్ బతికున్నంత వరకు తన పైన కాంగ్రెస్ కేసులు పెట్టలేదని, తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాక.. తాను ఆ పార్టీకి చెడ్డవాడినయ్యానని, అందుకే కేసులు పెట్టారన్నారు.

ప్రత్యేక హోదా
రాజకీయాల్లో కేసులు సహజమే అన్నారు. అయితే, తన పైన కేసులు ఉన్నప్పటికీ విభజన వద్దని తాను ఉద్యమించానని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఓటుకు నోటుకు భయపడి ప్రత్యేక హోదాను పక్కన పెట్టేస్తున్నారన్నారు. కేసులు ఉన్నాయని, కేసులు పెడతారని రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టవద్దన్నారు.
కేసులకు భయపడకుండా... మా నాయకుడు రాష్ట్రం కోసం ఇలా చేశారని చెప్పేలా చంద్రబాబు హోదా కోసం పోరాటం చేయాలన్నారు. లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు.

ప్రత్యేక హోదా
చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఇటీవల ప్లేటు మార్చారన్నారు. ఎలాగూ కేంద్రం హోదా ఇవ్వదని తెలిసి.. హోదా ఏం సంజీవిని కాదని అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ఎలా మేలు అని నిలదీశారు. పోలవరం తదితరాలపై మనకు ఇస్తామన్న దానినే కేంద్రం ప్యాకేజీ రూపంలో ఇస్తామంటోందన్నారు.

ప్రత్యేక హోదా
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటే.. తమిళనాడు, కర్నాటకలు అంగీకరించడం లేదని కేంద్రమంత్రులు చెబుతున్నారని, కానీ వారి పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు, కేంద్రమంత్రులు అబద్దాలు ఆడుతున్నారన్నారు.

ప్రత్యేక హోదా
ఏపీకి చెందిన తెలిసీ, తెలియని మంత్రులు కూడా 14వ ఆర్థిక సంఘం గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆర్థిక సంఘం పరిధి విద్యార్థులకు కూడా తెలుసునని చెప్పారు. దీని పేరు చెప్పి మా చెవుల్లో పూవులు పెట్టవద్దని విద్యార్థులు కూడా చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కేబినెట్ నిర్ణయం అన్నారు.

ప్రత్యేక హోదా
మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందన్నారు. అలాంటి మన ఏపీకి హోదా ఇస్తే మనకు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. ఒక్క జగన్ వల్ల సాధ్యం కాదు హోదా కోసం తాను 26వ తేదీన నిరవధిక దీక్షకు దిగుతున్నానని, అందరు సహకరించాలన్నారు.

ప్రపంచ బ్యాంక్ ర్యాంక్ పైన జగన్
ప్రపంచ బ్యాంక్ రాష్ట్రానికి రెండో స్థానం ఇచ్చిందని చంద్రబాబు చెపుతున్నారని, దాని వెనుక భారీ కుట్ర దాగి ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భారత దేశం వెనుకబడి ఉందని, దీన్ని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీలతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని నిర్వహించిందన్నారు.

ప్రపంచ బ్యాంక్ ర్యాంక్ పైన జగన్
ఇందులో కార్మిక, భూ, రుణాల విషయంలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి 98 అంశాలను రాష్ట్రాలు అమలు చేయాలన్న నిబంధన విధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాలు వీటిని ఆమోదించడానికి వెనుకాడాయని, కానీ చంద్రబాబు వెనకా ముందూ ఆలోచించకుండా సంతకం చేసేశారని చెప్పారు. అందుకే ప్రపంచ బ్యాంక్ మన రాష్ట్రానికి రెండో ర్యాంకు ఇచ్చిందని జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications