డ్రగ్ రహిత ఏపీ-కాలేజీలు, వర్సిటీలపై ఫోకస్-నాలుగంచెల వ్యూహంతో-జగన్ కీలక ఆదేశాలు

అమరావతి : స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్‌ శాఖపై క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ఇవాళ కీలక సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలని జగన్ ఆదేశించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దన్నారు. ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు పని చేయాలన్నారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్‌ పెట్టాలని, ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలన్నారు. నార్కొటిక్స్‌పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్

డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్

పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని ఇవాళ సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు.

వారంలో ఒకరోజు తప్పనిసరిగా సమావేశం కావాలన్నారు. వారంలో మరో రోజు పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలన్నారు. ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలని జగన్ ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్నారు. సచివాలయాల మహిళా పోలీస్‌లనూ సమన్వయం చేయాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.
వారిని ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. మహిళా పోలీస్‌ల పనితీరు ఇంకా మెరుగుపర్చాలన్నారు.
దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు కావాలన్నారు.

నాలుగు అంచెల వ్యూహం

నాలుగు అంచెల వ్యూహం

నార్కొటిక్స్‌తో పాటు, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరి కట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం, యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడంలో ఎక్సైజ్, ఎస్‌ఈబీ అధికారులతో పోలీస్‌ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలన్నారు. అదే విధంగా దిశ యాప్‌ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలన్నారు.

వారంలో రెండు మీటింగ్స్

వారంలో రెండు మీటింగ్స్

ఇందు కోసం ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలని జగన్ సూచించారు. అక్రమ మద్యం నియంత్రణ దిశలో ఎస్‌ఈబీ. ఎక్సైజ్‌ అధికారులు తీసుకున్న చర్యలు, గంజాయిసాగు అరికట్టడంపై వంటి వాటిని సమీక్షించాలన్నారు. ఆ తర్వాత ప్రతి గురువారం పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశం కావాలన్నారు. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలన్నారు. ఇక నుంచి ఇవన్నీ రెగ్యులర్‌గా జరగాలన్నారు.

కాలేజీలు, వర్శిటీలపై ఫోకస్

కాలేజీలు, వర్శిటీలపై ఫోకస్

ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 14500తో పాటు, నార్కొటిక్స్‌ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని, ఎక్కడా, ఏ ఒక్క విద్యార్థి నార్కొటిక్స్‌ వినియోగించకుండా చూడాలని జగన్ సూచించారు. రాష్ట్రాన్ని వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దాలని జగన్ సూచించారు. అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పని చేయాలన్నారు. మన యూనివర్సిటీలు, కాలేజీలు.. అన్నీ జీరో నార్కొటిక్స్‌గా ఉండాలన్నారు. అదే ఆయా శాఖల లక్ష్యం కావాలన్నారు. ఇందు కోసం నెల రోజుల్లో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో హోర్డింగ్‌ల ఏర్పాటు పూర్తి కావాలన్నారు.

దేశమంతా మనవైపు చూసేలా..

దేశమంతా మనవైపు చూసేలా..

మనం చేసిన పనుల వల్ల అవార్డులు రావాలని జగన్ సూచించారు. దేశంలో ఎక్కడ మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసులు లేరని, కాబట్టి వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. దాని వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చన్నారు. దేశమంతా మనవైపు చూసేలా మన చర్యలు ఉండాలన్నారు. ఆ స్థాయిలో పనితీరు చూపాలన్నారు.రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామన్న సీఎం, ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+