ప్రభుత్వాసుపత్రుల్లో అవినీతిపై కఠిన చర్యలు-ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ-జగన్ ఆదేశాలు..

వైద్య ఆరోగ్యశాఖపై ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై అధికారులతో జగన్ చర్చించారు. వీటిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, అవినీతి, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు పలు అంశాలున్నాయి. అనంతరం సీఎం జగన్ వైద్యఆరోగ్యశాఖల అధికారులకు పలు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని సీఎం జగన్ తెలిపారు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్‌ నంబర్‌ ప్రతిచోటా ఉంచాలన్నారు. అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్కుల పనితీరు ఇందులో కీలకం అన్నారు. ప్రివెంటివ్‌ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలమన్నారు.

 jaganmeetingforanticorreption

వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్‌ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలని జగన్ సూచించారు. ఓ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలన్నారు. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదన్నారు. 4 వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదని ఆదేశించారు. సీఎం ఆదేశాలమేరకు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్‌ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్‌ కేర్, డ్రస్సింగ్, బేసిక్‌ కార్డియాక్‌ లైఫ్‌ సపోర్ట్‌ లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామన్నారు.

అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్‌ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్‌తో బాధపడతున్నట్టు గుర్తించారు. వీరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయాలన్నారు. విలేజ్‌ క్లినిక్‌ స్ధాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలన్నారు. క్రమం తప్పకుండా ఈ పరీక్షలు చేయాలన్నారు.

 jagan

సికిల్‌ సెల్‌ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం సమీక్ష చేశారు. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్‌ హెల్త్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సమయంలో దంతసమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితులను గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం సూచించారు. ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలన్నారు. క్యూ ఆర్‌ కోడ్‌ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను ఇందులో నమోదు చేయాలన్నారు.

అనంతరం మెడికల్‌ కాలేజీలపైనా సీఎం సమీక్ష చేశారు. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్‌ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం సమీక్షించారు. మెడికల్‌ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానుండగా.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయని, మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+