అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ధికాన్ని చక్కదిద్దే పనిలో జగన్ ? నియామకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు-సీఎఫ్ఎంస్ స్ధానంలో హెర్బ్ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో భారీ ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తున్న వైసీపీ సర్కార్ దాన్ని సుదీర్ఘకాలం ముందుకు తీసుకెళ్లడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో వ్యయనియంత్రణతో పాటు ఆర్ధికశాఖల్లో కీలక మార్పులు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆర్ధిక శాఖ కీలక సర్కులర్ జారీ చేసింది. అలాగే వచ్చే బడ్జెట్ తర్వాత ఇప్పటివరకూ వాడుతున్న సీఎఫ్ఎంఎస్ స్ధానంలో హెర్బ్ వ్యవస్ధను వాడుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

కలవరపెడుతున్న ఖజానా ?

కలవరపెడుతున్న ఖజానా ?

ఏపీలో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంతో పోలిస్తే సంక్షేమానికి పెడుతున్న ఖర్చు అంతకంతకూ పెరుగుతూ పోతుండటం అందరినీ కలవరపెడుతోంది. అయితే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించడంతో ఆర్దిక శాఖపై ఒత్తిడి అమాంతం పెరుగుతోంది. దీంతో భారీ స్దాయిలో అప్పులు తీసుకొస్తున్నారు. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు తగ్గిపోవడంతో జీఎస్టీ ఆదాయంలో వాటాతో పాటు మరికొన్ని నిధులతోనే కాలం గడపాల్సి వస్తోంది. ఇవి ఎటూ సరిపోకపోవడంతో ఇప్పుడు వ్యయ నియంత్రణ చర్యలతో పాటు కొన్ని కీలక మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

నియామకాలపై ఆంక్షలు

నియామకాలపై ఆంక్షలు

రాష్ట్ర ఆర్ధిక శాఖ తాజాగా ఓ సర్కులర్ జారీ చేసింది. ఇందులో నియామకాల విషయంలో పలు చర్యల్ని సూచించింది. వీటిలో కొత్తగా కన్సల్టెంట్లను నియమించుకోవద్దని కోరింది. అలాగే రిటైరైన ఉద్యోగుల్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవడాన్ని కూడా తగ్గించుకోవాలని సూచించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది సంఖ్యను కూడా భారీగా తగ్గించుకోవాలని ఆదేశించింది. కాంట్రాక్టు సిబ్బందిని సైతం అవసరాన్ని బట్టి మాత్రమే కొనసాగించనున్నారు. తద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గబోతోంది. కానీ వివిధ ప్రభుత్వ శాఖలు తాజాగా చేపట్టే నియామకాలపై దీని ప్రభావం పడనుంది.

వాహనాలపైనా ఆంక్షలు

వాహనాలపైనా ఆంక్షలు


నియామకాల విషయంలోనే కాదు ఖర్చు తగ్గించుకునేందుకు మరిన్ని చర్యల్ని ఆర్ధిక శాఖ సూచించింది. ఇందులో కొత్త వాహనాల కొనుగోలుపైనా ఆంక్షలు పెట్టింది. అత్యవసర సేవలకు మాత్రమే కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. అలాగే ప్రైవేటు వాహనాల్ని అద్దెకు తీసుకునే విషయంలోనూ స్పష్టమైన ఉత్తర్వులు ఉంటేనే వాటి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది. ప్రభుత్వం మంజూరు చేయని వాటి విషయంలో చెల్లింపులు చేయకుండా కట్టడి చేసింది.

కేంద్రం తరహా పథకాల్లేకుండా..

కేంద్రం తరహా పథకాల్లేకుండా..

అలాగే రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాల విషయంలోనూ ఆర్ధిక శాఖ తాజాగా కొత్త సూచనలు చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను పోలిన పథకాలు రాష్ట్రంలో రూపకల్పన చేయకుండా చూడాలని కోరింది. అలాగే రాష్ట్రంలో ఒకే తరహా పథకాలు ఒకటికి మించి ఉంటి వాటిని కలిపేద్దామని కూడా ప్రతిపాదించింది. తద్వారా ఆయా పథకాల ద్వారా డూప్లికేషన్ కాకుండా ఉంటుందని తెలిపింది. దీని ద్వారా భారీగా వ్యయ నియంత్రణకు కూడా అవకాశం ఉంటుంది.

 సీఎఫ్ఎంఎస్ స్ధానంలో హెర్బ్ ?

సీఎఫ్ఎంఎస్ స్ధానంలో హెర్బ్ ?

రాష్ట్రంలో ఆర్ధిక వ్యవహారాలకు ఉపయోగపడుతున్న సీఎఫ్ఎంఎస్ వ్యవస్ధ స్ధానంలో హెర్బ్ వ్యవస్ధను అమల్లో పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ ప్రతిపాదనల్ని సీఎఫ్ఎంఎస్ లో కాకుండా హెర్బ్.సీఎఫ్ఎస్ఎస్.ఇన్ లో అప్ లోడ్ చేయాలని ఆర్ధిక శాఖ చేసిన సూచనతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎఫ్ఎంఎస్ వ్యవస్ధ ద్వారా నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తున్నందునే దీన్ని పక్కనబెట్టి స్ధానిక నిపుణులతో తయారు చేయించిన హెర్బ్ ను వాడాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ కొత్త వ్యవస్ధ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

English summary
ap cm ys jagan to made key changes in ap financial department to revive state economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X