జగన్ బీసీ మైండ్ గేమ్- పదవులన్నీ వారికే- వీరికి మాత్రం నిరాశే-రాజకీయంగా నష్టం తప్పదా?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి భారీగా ఉపయోగపడినవి బీసీ కులాలు. గతంలో దశాబ్దాలుగా టీడీపీకి అండగా నిలిచిన బీసీ కులాలు ఆ పార్టీకి దూరమై వైసీపీ వైపు మొగ్గుచూపడంతో జగన్ పార్టీ భారీ విజయాలు అందుకుంది. అలాంటి బీసీ కులాలకు ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో ఏమాత్రం ప్రాతినిధ్యం దక్కుతుందో తెలిస్తే షాక్ కావాల్సిందే. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం కలిగిన బీసీ కులాలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం భవిష్యత్తులో వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 వైసీపీవైపు తొలిసారి బీసీలు

వైసీపీవైపు తొలిసారి బీసీలు

ఏపీలో టీడీపీకి దశాబ్దాలుగా అండగా నిలిచిన బీసీలు తొలిసారి 2019లో వైసీపీ వైపు మొగ్గాయి. దశాబ్దాలుగా టీడీపీకి అండగా ఉన్నా తమకు దక్కిందేమీ లేదన్న భావనే ఇందుకు కారణం. అదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో కొన్ని బీసీ కులాలు ఎదుర్కొన్న అవమానాలు కూడా మరో కారణం. అలాగే వైసీపీ బీసీల కోసం తొలిసారి ఇచ్చిన కార్పోరేషన్ల హామీతో పాటు మరికొన్ని హామీలు కూడా వైసీపీవైపు వారు మొగ్గడానికి కారణమయ్యాయి.

దీంతో వైసీపీ భారీ సంఖ్యలో సీట్లు, మెజారిటీలు అందుకుంది. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం వంటి జిల్లాల్లో తొలిసారిగా వైసీపీ ఆధిపత్యం సాగుతోందంటే కారణం ఈ బీసీ ఓట్లే. కానీ అధికారంలోకి వచ్చాక వైసీపీ బీసీల కోసం ఏం చేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 అధికారంలోకి వచ్చాక

అధికారంలోకి వచ్చాక

మరి అలాంటి బీసీ కులాలకు వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన మేలు ఏంటన్నది ఓసారి పరిశీలిస్తే అవాక్కు కాక తప్పదు. బీసీలకు పదుల సంఖ్యలో కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా కనీసం ఛైర్మన్లకు, డైరెక్టర్లకు ఆఫీసులు, జీతభత్యాలు లభిస్తున్నాయో లేదో కూడా తెలియని పరిస్ధితి. నిధుల కేటాయింపు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే కొన్ని సామాజికంగా ప్రభావం చూపించే బీసీ కులాలకు మాత్రమే పదవులు దక్కడం సర్వసాధారణంగా మారింది. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితా గమనించినా అందులోనూ వారికే చోటు దక్కడంతో ఇప్పటివరకూ ప్రభుత్వ పదవులు దక్కించుకోలేని బీసీ కులాలు రగిలిపోతున్నాయి.

బీసీలంటే వీరేనా?

బీసీలంటే వీరేనా?

ప్రస్తుతం వైసీపీ సర్కార్ దృష్టిలో కొన్ని బీసీ కులాలకు మాత్రమే ప్రాధాన్యం దక్కుతోంది. ప్రభుత్వ పదవుల దగ్గరి నుంచి మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు.. ఇలా ఎక్కడ చూసినా వీరి హవానే కొనసాగుతోంది. ఇాలా వైసీపీ సర్కార్ లో భారీగా అవకాశాలు దక్కించుకున్న బీసీ కులాల్లో మత్సకార, యాదవ, తూర్పు కాపు, గౌడ, పద్మశాలి వంటి కులాలే ఎక్కువగా ఉంటున్నాయి.

జగన్ కేబినెట్ తో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా, శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా, ఇంకా ప్రభుత్వంలోని కీలక పదవుల్లోనూ ఎక్కడ చూసినా ఇప్పుడు వీరే కనిపిస్తున్నారు. ఓసారి అవకాశం దక్కిన కులాలకు సైతం మళ్లీ మళ్లీ పదవులు లభిస్తున్నాయి.

గ్రామీణ వృత్తి కులాలపై చిన్నచూపు

గ్రామీణ వృత్తి కులాలపై చిన్నచూపు

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో పదవులు దక్కించుకున్న బీసీ కులాల సంఖ్య తక్కువగా ఉండగా.. పదవులకు, పనులకు దూరంగా ఉండిపోతున్న కులాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి వాటిలో గ్రామీణ వృత్తికులాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరిలో రజకులు, కుమ్మరులు, నాయీ బ్రహ్మణులు, దూదేకులు వంటి వారు అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు.

వీరికి ప్రభుత్వం ఏర్పడి ఈ రెండున్నరేళ్లలో ప్రకటించిన ఏ కీలక పదవీ లభించలేదు. వీరిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుని వదిలేస్తున్నారు. జగన్ చెప్తున్న బీసీ కులాల సామాజిక సాధికారత సాధ్యం కావాలంటే ముందు వీరికి ప్రాధాన్యం దక్కాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు.

 బీసీల మధ్య పెరుగుతున్న గ్యాప్

బీసీల మధ్య పెరుగుతున్న గ్యాప్

వైసీపీ సర్కార్ లో కేవలం కొన్ని ఆర్ధికంగా బలమైన కులాలకే పదవుల్లో, ప్రాతినిధ్యంలో, పనుల్లో ప్రాధాన్యం దక్కుతుండటంతో మిగతా కులాల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో ఇదే కారణంతో టీడీపీని వదిలి వైసీపీకి జై కొట్టిన వీరంతా ఇప్పుడు వైసీపీ సర్కార్ పై తీవ్ర అంసతృప్తిగా ఉన్నారు. అయితే వీరి అంసతృప్తిని గమనించే తీరిక ప్రభుత్వానికి లేకపోవడంతో తమ ముందే పదవులు తెచ్చుకుంటున్న తోటి బీసీ కులాల నేతల్ని చూసి వీరు రగిలిపోతున్నారు.

దీంతో పీసీ కులాల మధ్య పోరు కూడా పెరుగుతోంది. వైసీపీ సర్కార్ లో బీసీల పేరుతో అన్ని పదవులూ వీరే అనుభవిస్తారా అన్న చర్చ వీరిలో సాగుతోంది. ఇది అంతిమంగా వైసీపీ పుట్టిముంచేలా కనిపిస్తోంది.

 జగన్ బీసీ మైండ్ గేమ్ ?

జగన్ బీసీ మైండ్ గేమ్ ?

వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల్లో అన్ని బీసీ కులాల అభివృద్ధితో పాటు ఇప్పటివరకూ అవకాశాలు దక్కనివారికి ప్రాతినిధ్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ ప్రాతినిధ్యమే ప్రభుత్వ పదవుల్లో కరువైపోతోంది. దీంతో ప్రభుత్వంలో అవకాశాలు దక్కించుకోలేని వారు రగిలిపోతున్మారు. కానీ సీఎం జగన్, వైసీపీ పెద్దలు మాత్రం ఆర్ధికంగా బలవంతులైన కులాలే తమకు రాజకీయంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

మిగతా వారిని ఏదో రకంగా బుజ్జగించి ఓటుబ్యాంకుగా వాడుకుందామనే భావనతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో జగన్ ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమ్ రాజకీయంగా తీవ్ర నష్టం చేసేలా ఉందన్న వాదన పెరుగుతోంది. మరి జగన్ ఇప్పటికైనా ఈ అంశంపై దృష్టిపెడతారో లేదో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+