కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ పాదయాత్రకు మరిన్ని పంచ్ లు ! కొత్త ట్విస్టులు రెడీ చేస్తున్న జగన్ ?

ఏపీలో ఎల్లుండి పాదయాత్ర మొదలుపెట్టబోతున్న నారా లోకేష్ కు అసలు ట్విస్ట్ లు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో తొలిసారి పాదయాత్రకు జిల్లాల వారీగా అనుమతులివ్వడం వెనుక ఇదే కారణం.

|
Google Oneindia TeluguNews

కుప్పం : ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను ఆకట్టుకునేందుకు టీడీపీ యువనేత నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా అనుమతిచ్చే అవకాశం ఉన్నా జిల్లాల వారీగా అనుమతులిచ్చేందుకు సిద్ధమైంది. అలాగే ఈ ముసుగులో మరిన్ని ట్విస్టులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం...

నారా లోకేష్ పాదయాత్ర

నారా లోకేష్ పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ ఎల్లుండి కుప్పంలో తన యువగళం పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. దీనికి అనుమతులు కోరుతూ గతంలో టీడీపీ నేతలు రాసిన లేఖకు చివరి నిమిషం వరకూ స్పందించని పోలీసులు.. చివర్లో మాత్రం అనుమతి ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రకు డీజీపీ, హోంసెక్రటరీతో పాటు జిల్లా ఎస్పీలకు కూడా టీడీపీ లేఖలు రాసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకమొత్తంగా ఇవ్వాల్సిన అనుమతిని కాస్తా జిల్లాల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ముందుగా చిత్తూరు ఎస్పీ టీడీపీ లేఖకు స్పందించి లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు.

చిత్తూరు జిల్లాకే అనుమతి

చిత్తూరు జిల్లాకే అనుమతి

నారా లోకేష్ పాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా నడిచేందుకు టీడీపీ అనుమతి కోరినా ప్రభుత్వం మాత్రం చిత్తూరు జిల్లా వరకే ప్రస్తుతానికి అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి అనుమతి ఇస్తూ పలు షరతులు విధించారు. జిల్లా పరిధిలో పాదయాత్రకు 15 షరతులు, కుప్పంలో పెట్టే బహిరంగసభకు 14 షరతులు విధించారు. దీంతో కుప్పంతో పాటు చిత్తూరు జిల్లా పరిధిలో మాత్రం నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. అయినా టెన్షన్ మాత్రం అలాగే కొనసాగుతోంది. దీని వెనుక పలు కారణాలున్నాయి.

కలవరపెడుతున్న జీవో నంబర్ 1 ?

కలవరపెడుతున్న జీవో నంబర్ 1 ?


నారా లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్రకు ఇప్పుడు జీవో నంబర్ 1 భయం వెంటాడుతోంది. పూర్తిగా రోడ్లపై సాగే లోకేష్ పాదయాత్రను ఎప్పుడైనా అడ్డుకునే అవకాశాన్నిస్తున్న జీవో నంబర్ 1ను పోలీసులు ఎప్పుడు ప్రయోగిస్తారో తెలియని పరిస్దితి. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు జీవో నంబర్ 1తోనే అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని, మైక్ సెట్లను కూడా వాడుకోనివ్వలేదు. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలోనూ జీవో నంబర్ 1 ప్రయోగిస్తే పరిస్ధితి ఏంటన్న దానిపై టీడీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అయితే హైకోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండటంతో ఆ తర్వాతే దీనిపై క్లారిటీ రానుంది.

కొత్త ట్విస్టులు రెడీ చేస్తున్న జగన్ ?

కొత్త ట్విస్టులు రెడీ చేస్తున్న జగన్ ?

గతంలో వైఎస్, చంద్రబాబు, జగన్ చేపట్టిన పాదయాత్రలకు రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఇచ్చే వారు. స్ధానికంగా పరిస్దితిని బట్టి పోలీసులు కొన్ని షరతులు పెట్టేవారు. కానీ ఈసారి లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది చిత్తూరు పోలీసులు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఇవ్వలేదు. అలాగే జీవో నంబర్ 1ను ప్రయోగించేందుకు ప్రభుత్వం వద్ద అన్ని ఆప్షన్లు ప్రస్తుతానికి సజీవంగానే ఉన్నాయి. మరోవైపు జిల్లాల వారీగా అనుమతులివ్వడం అంటే అప్పటి పరిస్దితి ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకునేందుకు ప్రభుత్వానికి మరో అవకాశం దక్కినట్లే. దీంతో జిల్లాల వారీగా పోలీసుల అనుమతులు తీసుకుని లోకేష్ పాదయాత్ర కొనసాగించాల్సి ఉంటుంది. మధ్యలో అవాంఛనీయ ఘటనలు జరిగితే మాత్రం ఆయా జిల్లాల ఎస్పీలు అనుమతి రద్దు చేసేందుకు అవకాశం ఉండనే ఉంది. దీంతో లోకేష్ పాదయాత్ర పూర్తి ఆంక్షల వలయంలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
ap cm ys jagan seems to prepare more twists for tdp leader nara lokesh's padatra scheduled to start on jan 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X