చంద్రబాబు ఎవరని జగన్?: కుతూహలమ్మ కన్నీరు, గవర్నర్‌పై దాడి

హైదరాబాద్: రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వైసీపీ సభ్యుల గందరగోళం మధ్య శనివారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. హోదాపై ఏపీ అసెంబ్లీ రెండో రోజు కూడా దద్దరిల్లింది. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో హోరెత్తింది. ప్రతిపక్ష సభ్యుల పట్ల మార్షల్స్ వ్యవహించిన తీరుపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అసెంబ్లీ కమిటీ హాలులో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదాపై మొన్న అర్ధరాత్రి నుంచి డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. అర్ధరాత్రి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా స్టేట్ మెంట్లు ఇస్తారా? అని నిలదీశారు. మొన్నైతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకూ హడావుడి చేశారని మండిపడ్డారు.

Ys jagan Press meet in assembly committee hall

జైట్లీ ప్రకటనలో కొత్తగా ఏమీ చెప్పలేదు
మొన్నటి ప్రకటనలో జైట్లీ కొత్తగా ఏమీ చెప్పలేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని జైట్లీ చెప్పారన్నారు. అర్ధరాత్రి జైట్లీ ఇచ్చిన స్టేట్ మెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతీస్తామని అంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి నిజాయితీ ఎక్కడ ఉందని మండిపడ్డారు. కేంద్రమంత్రులు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడిని పక్కన కూర్చోబెట్టి మరీ చెప్పారన్నారు.

ఓటుకు నోటు: చంద్రబాబు రాజీనామా చేయాలి
ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకే చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయడం లేదని అన్నారు. తన స్వార్ధం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. యువతకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. యువత జీవితాలను నాశనం చేయడానికి చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. వెంటనే రాజీనామా చేయాలని, కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది ప్రజల ఆశలను తాకట్టు పెట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు.

కుతూహలమ్మను కన్నీరు పెట్టించారు
ఈ విషయాలన్నింటిపై అసెంబ్లీలో నిలదీస్తుంటే చంద్రబాబుతో స్టేట్ మెంట్ ఇప్పిస్తామని అంటున్నారు. వీరికి మద్దతుగా స్పీకర్ ప్రవర్తన ఉందని అన్నారు. రెండు నిమిషాల పాటు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో స్పీకర్‌గా పని చేసిన కుతూహలమ్మను కన్నీరు పెట్టించారు.

కేంద్ర పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇస్తుంది
విభజన సమయంలో సభలో ప్రకటన చేసేందుకు వచ్చిన గవర్నర్ నరసింహాన్‌పై చంద్రబాబు చేతులు ఊపుతూ దాడి చేయించారని చెప్పారు. అసెంబ్లీలో మార్షల్స్‌ను మొదటిసారి చూస్తున్నామన్నారు. ఏపీ హోదా సాధించే విషయంలో చంద్రబాబు డ్రామా ప్రారంభించారన్నారు. ఇక, ఏపీకి కేంద్రం ప్రకటించిన ఆర్ధిక సాయం నోట్‌ను చదివి వినిపించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన మేలెంటో చెప్పాలని నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తలు చేత రాష్ట్రంలో పోర్టులు కట్టిస్తూ క్లియరెన్స్ అంటూ క్రెడిట్‌కు చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. కేంద్ర పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇస్తున్నారన్నారు.

రాష్ట్రాలు లోటులో ఉంటే కేంద్రం నిధులివ్వాలి
కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ఫ్యాక్టరీ కోసం పదివేల మంది యువత ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉంటే నిధులు ఇవ్వాలని 14వ ఆర్ధిక సంఘం చెప్పిందన్నారు. ప్రత్యేకహోదాకు 14వ ఆర్ధిక సంఘం వ్యతిరేకమని చూపిస్తారా? అంటూ నిలదీశారు. 2015 నుంచి 2020 దాగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని 14వ ఆర్ధిక సంఘం చెప్పలేదన్నారు. ఒకవేళ అది చెప్పినా కేవలం అది సిఫారసు మాత్రమేనని అన్నారు. 14వ ఆర్ధిక సంఘం సిఫారసును ప్రభుత్వం తీసుకోకపోయినా నష్టం లేదన్నారు.

హైదరాబాద్ లేకుండా పోతుందని వెంకయ్య ప్రత్యేకహోదా అడిగారు
మరి ఆరోజు వెంకయ్య నాయుడు లోక్ సభలో ఏపీకి ప్రత్యేకహోదాపై ఎందుకు అంతలా మాట్లాడారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను నిర్మించడానికి 65 ఏళ్లు పట్టిందన్నారు. అలాంటి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంకు పోతుంది కాబట్టి ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరారన్నారు. హోదా లభిస్తే వంద శాతం నిధులతో పాటు పారిశ్రామిక రాయితీలు లభిస్తాయన్నారు. హోదా వల్లే ఎంతో లాభముందన్నారు. అందుకోసమే వెంకయ్య నాయుడు ఆరోజు సభలో గట్టిగా పట్టుబట్టారన్నారు. పక్కనే ఉన్న హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు పోకుండా ఉండేందుకే ఆయన ప్రయత్నించారన్నారు. ఎందుకంటే అక్కడ బెటర్ మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు.

జీఎస్టీ బిల్లులో కూడా ప్రత్యేకహోదా
జీఎస్టీ బిల్లులో కూడా ప్రత్యేకహోదా ప్రస్తావన ఉందన్నారు. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలకు ప్రత్యేక నిధులుంటాయన్నారు. ఏదైనా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేటప్పుడు మీరు కట్టే సేల్స్ ట్యాక్స్‌లను తిరిగి చెల్లిస్తామని చెబుతారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపన జరుగుతుందన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై
పోలవరం ప్రాజక్టుపై వంద శాతం నిధులిస్తామని చెబుతున్నారు. సెక్షన్ 90 ప్రకారం కేంద్రమే వంద శాతం నిధులను భరించాలన్నారు. కేంద్రమే పోలవరం ప్రాజెక్టుని నిర్మించాలని చట్టంలో ఉందన్నారు. కానీ జైట్లీ మాత్రం కొత్తగా చెబుతున్నారు. విభజన చట్ట ప్రకారం పోలవరం అథారిటీని మాత్రమే క్రియేట చేసిందన్నారు. గుజరాత్‌కు చెందిన అధికారిని పోలవరం ప్రాజెక్టు సీఈఓగా నియమించారన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఆంధ్రా ఇంత కట్టాలి, కేంద్రం ఇంత కట్టాలి అనే ప్రస్తావన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదన్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయాలు
వెనుక బడిన ప్రాంతాలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపింస్తోదన్నారు. విభజనలో ఉన్న వాటినే మళ్లీ చెబుతున్నారన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటు అనేది 15వ షెడ్యూలోనే ఉన్నాయన్నారు. మాకు రావాల్సినవే మాకు ఇస్తూ, మీరేదో ఇస్తున్నట్టు గొప్పగా చెబుతున్నారన్నారు. కేంద్రం చెప్పినవన్నీ విభజన చట్టంలో ఉన్నాయన్నారు. మన ముఖ్యమంత్రి ఏమో జైట్లీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెప్పడం ఎంతవరకు ధర్మమన్నారు.

చంద్రబాబు చరిత్రి హీనుడిగా మిగిలిపోతారు
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారన్నారు. హోదా అనేది మన హక్కు అన్నారు. మనం దీని గురించి వదిలేస్తే ఎవరూ పట్టించుకోరన్నారు. ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించినా వదిలేదన్నారు.

కేసీఆర్ వదిలేస్తే తెలంగాణ వచ్చి ఉండేది కాదు
కేసీఆర్ వదిలేస్తే తెలంగాణ వచ్చి ఉండేది కాదన్నారు. న్యాయమే గెలుస్తోందని, ధర్మం గెలుస్తోందన్నారు. ఏపీకి హోదాను మనం పోరాటం చేసి తెచ్చుకోవాలన్నారు. అయితే ఈరోజు వస్తుందని తాను చెప్పలేనని, పోరాటం వదిలేస్తే రాదని మాత్రం చెప్పలగలనన్నారు. అన్నింటికి మించి ఏపీకి హోదా సాధించాలన్నారు. ఇందులో భాగంగా ఓ అడుగు ముందుకేసి బంద్‌కు పిలునిచ్చామన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి నిమిషం ఏపీకి నష్టమే
చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతి నిమిషం ఆంధ్రప్రదేశ్‌కు నష్టమేనన్నారు. జైట్లీ వ్యాఖ్యలను చంద్రబాబు స్వాగతిస్తున్నామని చెప్పినందుకే అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తున్నామన్నారు. జైట్లీ వ్యాఖ్యల మూలంగానే అసెంబ్లీని స్తంభింప చేస్తున్నామన్నారు. మనం చేస్తున్న పోరాటం మన పిల్లల కోసం చేస్తున్నామని మర్చిపోకండన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందగా ముందుకు వచ్చి బంద్‌లో పాల్గొలన్నారు. బంద్‌కు అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+