ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆళ్లగడ్డలొ అఖిలప్రియకు ఝలక్: జగన్‌కు ఊహించని మద్దతు, 'ఆమెను చూసి బాధపడ్డా'

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan public meeting in Allagadda ఆళ్లగడ్డలొ జగన్‌కు ఊహించని మద్దతు

కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కర్నూలు జిల్లాలో ప్రజలు నీరాజనాలు పలికారు. ఆళ్లగడ్డలోను పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన అఖిలప్రియకు ఇది తొలి ఝలక్ అంటున్నారు.

మంత్రి అఖిలప్రియకు చిక్కులుమంత్రి అఖిలప్రియకు చిక్కులు

జగన్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు

జగన్ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనాలు

జగన్ బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆయనకు నీరాజనం పలికారు. జగన్‌ను చూసేందుకు వచ్చిన జనంతో ఆళ్లగడ్డ పట్టణం కిక్కిరిసింది. నలువైపులా పెద్ద ఎత్తున జనం కనిపించారు. జగన్ సభకు అంతమంది రావడాన్ని టీడీపీ కూడా జీర్ణించుకోలేకపోతోందట.

కలిసేందుకు పోటీ

కలిసేందుకు పోటీ

జగన్‌తో కరచాలనాలు చేసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనం పోటీ పడ్డారు. జగన్ వారిని పలకరిస్తూ ముందుకు పోయారు. అనంతరం ఫోర్ రోడ్ జంక్షన్‌కు చేరుకొని మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరని, రైతులకు గిట్టుబాటు ధర లేక అవస్తలు పడుతున్నారని అందుకే పాదయాత్ర మొదలు పెట్టానని చెప్పారు.

నిరీక్షణను చూసి చలించిన జగన్

నిరీక్షణను చూసి చలించిన జగన్

కాగా, చర్మం కాలిపోయి అనారోగ్యంతో బాధపడుతున్న నిరీక్షణ అనే బాలిక పరిస్థితిని చూసి జగన్ చలించిపోయారు. ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమె గురించి బహిరంగ సభలో చెప్పారు.

నాకే బాధ అనిపించిందన్న జగన్

నాకే బాధ అనిపించిందన్న జగన్

చర్మం కాలిపోయి పనులు చేసుకోలేకపోతోందని, నాకే బాధ అనిపించిందని, ఆమెకు ప్రభుత్వం పింఛన్ ఇవ్వడం లేదని జగన్ చెప్పారు. ఆమెతో మాట్లాడుతూ.. నీకు మైక్ ఇస్తాను, నీ గురించి నీవు చెప్పు, అప్పుడైనా చంద్రబాబుకు బుద్ధి వస్తుందని జగన్ అన్నారు. ఈ సందర్భంగా నిరీక్షణ తనకు రెండేళ్లుగా పింఛన్ రావడం లేదని, జగన్ ఆదుకున్నారని చెప్పారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's public meeting in Allagadda on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X