YS Jagan: దాడులతో మీ ఓటమి ఆగదు-విపక్షాలకు జగన్ వార్నింగ్- గుడివాడలో కీలక వ్యాఖ్యలు..!
విజయవాడలో రాయి దాడి ఘటన తర్వాత తిరిగి ఇవాళ మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ సాయంత్రం గుడివాడలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఒక్క జగన్ మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, విపక్ష పార్టీలు కలిసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. అయినా మీ బిడ్డ అదరడు, అయినా మీ బిడ్డ బెదరడు అన్నారు. దీనికి కారణం శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ అన్నారు. చేసిన మంచి మీద, దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఓ బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదన్నారు.
జగన్ మీద ఒకరాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో దుష్టచతుష్టయం ఓటమిని, పెత్తందారుల ఓటమిని ఎవ్వరూ ఆపలేరన్నారు. ఇలాంటి దాడుల వల్ల తన సంకల్పం చెక్కుచెదరదన్నారు. ఈ స్ధాయికి వారు దిగజారారంటే దానర్దం విజయానికి తాము చేరువయ్యామనే కదా అన్నారు. ఈ తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు, బెదరడన్నారు. మీకు సేవాలన్న తన సంకల్పం దీంతో మరింత పెరుగుతుందన్నారు. వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

తన నుదుడి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో తనకు ఎక్కడా తగల్లేదన్నారు. దానర్ధం దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడని అన్నారు. తన నుదుడి మీద వారు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుందని, కానీ పేదలకు, రైతులకు, అక్కాచెల్లెళ్లకు, నిరుద్యోగులకు, సామాజిక వర్గాలకు చంద్రబాబు చేసిన గాయం మానిపోదన్నారు. చంద్రబాబు చేసిన మోసాల్ని వీరంతా మర్చిపోయే ప్రసక్తే ఉండదన్నారు. మోసం చంద్రబాబు నైజమైతే ఇంటింటికీ మంచి చేయడం తన నైజమన్నారు.












Click it and Unblock the Notifications