నచ్చకపోయినా బాబుకు ఓకే, కానీ: రాజధానిపై జగన్
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ పరిసరాలను రాజధానిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీని పైన సభలో చర్చ ప్రారంభమైంది. సభ వాయిదా పడి, తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మాట్లాడారు.
రాజధాని పైన చర్చ జరగాలను తాము మొదటి నుండి కోరుతున్నామని, కానీ ప్రభుత్వం అలా చేయలేదన్నారు. రాజధాని పైన ప్రకటన చేసిన తర్వాత చర్చ ప్రారంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30వేల ఎకరాలు ఉన్నచోటనే రాజధానిని ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామన్నారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించారని ఆరోపించారు.

తాము రాజధానిని బెజవాడలో ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం కాదని జగన్ చెప్పారు. రాజధాని ఎక్కడ పెట్టినా అభ్యంతరం లేదన్నారు. అయితే, చర్చ జరగకముందే ప్రకటన చేయడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రకటన తీరు తమకు నచ్చకపోయినప్పటికీ తాము బెజవాడను రాజధానిగా చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు.
సామాన్యులకు అందుబాటులో రాజధాని ఉండాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. రాజధాని పైన నిర్మాణాత్మక సలహాలిస్తామన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టలేకే తాము ప్రకటనను ఆహ్వానిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications