దాసరికి పవన్ కళ్యాణ్‌తో లింక్ పెట్టడమా?: జగన్ పార్టీలో గుసగుస!

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దర్శకరత్న దాసరి నారాయణ రావును కలవడంపై పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతోందని సమాచారం. పవన్ కళ్యాణ్‌కు చెక్ చెప్పేందుకు దాసరిని తెరపైకి తీసుకురావడంపై వైసిపి నేతలు గుసగుసలాడుకుంటున్నారంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - బిజెపి మిత్రపక్షాలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మద్దతు వల్ల ఆ కూటమికి భారీగానే కాపుల ఓట్లు పడ్డాయి. ఈ లెక్కలు వేసుకున్న జగన్ భవిష్యత్తు దృష్ట్యా కాపుల మద్దతు కోసం దాసరిని కలిశారనే వాదనలు ఉన్నాయి.

అయితే, టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలుకుతున్ పవన్ కళ్యాణ్‌కు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవికి చెక్ చెప్పేందుకు దాసరిని కలవడం ఏమిటని వైసిపి నేతలు చర్చించుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

YS Jagan's Dasari strategy, debate in parties

మెగా సోదరులు, దాసరిలు కాపు సామాజిక వర్గానికి చెందిన వారైనంత మాత్రాన... వారిని పోల్చుకొని రాజకీయ లెక్కలు వేయలేమని భావిస్తున్నారట. సినిమాల్లో దాసరి టాప్ డైరెక్టర్ అయినప్పటికీ... జనాల్లో హీరోలకు ఉన్న పలుకుబడి అంతగా ఉండదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారట.

చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక.. ఆ పార్టీ దాసరిని పక్కన పెట్టడాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారట. వారిని ఒకరితో ఒకరిని పోల్చడం సరికాదని పార్టీలోనే కొందరు భావిస్తున్నారని అంటున్నారు. అయితే, దాసరి చేరిక ద్వారా ఎంతోకొంత జగన్‌కు మేలు జరుగుతుందని ఎక్కువ మంది భావిస్తున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+