బెంగళూర్ వెళ్లేందుకు కోర్టుకు వైయస్ జగన్ అపీల్
హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూర్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతిని కోరారు. ఎన్నికల ప్రచారంవల్ల బంధుమిత్రులను కలుసుకోలేకపోయానని చెబుతూ ఇందుకోసం బెంగళూరు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. ఆ మేరకు అధినేత వైఎస్ జగన్ సోమవారం సిబిఐ కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు.
అదే విధంగా ఒఎంసి కేసులో నిందితుడైన బివి శ్రీనివాస రెడ్డి కూడా బళ్లారి వెళ్లేందుకు అనుమతి కోరారు. తమ నాయనమ్మ చనిపోయిన నేపథ్యంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. వీటిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిిబఐని న్యాయమూర్తి ఆదేశించారు.

వైయస్ జగన్ సోమవారం ఢిల్లీ వెళ్లి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఎన్డియేకు అంశాలవారీ మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు తమకు అవసరం లేదని బిజెపి నేతలు ఆయనకు చెప్పారు.
సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటమి పాలు కావడంతో జగన్ తీవ్రమైన నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజకీయ కార్యాచరణను సమీక్షించుకునే పనిలో పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications