వినుకొండకు జగన్.. భద్రత కుదించిన ప్రభుత్వం.. ఐజీ కీలక సూచన..
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న వరుస దాడుల క్రమంలో నిన్న వినుకొండలో రషీద్ అనే కార్యకర్త హత్యకు గురయ్యాడు. దీనిపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకున్నారు. ఇవాళ ఉదయం భారీ వర్షం నేపథ్యంలో రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు. అయితే పోలీసులు జగన్ కు తాడేపల్లి నుంచే చుక్కలు చూపిస్తున్నారు.
ఉదయం తాడేపల్లి నుంచి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో కలిసి వినుకొండ వెళ్లేందుకు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో దాన్ని కాదని జగన్ మరో ప్రైవేట్ వాహనంలో వినుకొండకు బయలుదేరారు. అయితే జగన్ వెంట బయలుదేరిన వైసీపీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.

వినుకొండకు బయలుదేరిన @ysjagan అన్న!! pic.twitter.com/Weyzf4Zgos
— YS Jagan Trends ™ (@YSJaganTrends) July 19, 2024
వై ఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో జగన్ తో పాటు వినుకొండ బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు లో పార్టీ నేతల వాహనాలు ఆపేసిన పోలీసులు.. వారికి అనుమతి లేదని చెప్తున్నారు. ఇన్నాళ్లు జగన్ వాడుతున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు.. పాత వాహనం ఒకటి ఇచ్చారు. దీన్ని తీసుకోకుండా జగన్ మరో వాహనంలో బయలుదేరారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

మరోవైపు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ జగన్ పర్యటన నేపథ్యంలో పలు సూచనలు చేశారు. వినుకొండలో 144 సెక్షన్ అమలులో ఉందని, ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జగన్ రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చి వెళ్లిపోవాలన్నారు. జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దన్నారు, ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవ్వరూ రోడ్లపైకి రావద్దన్నారు.












Click it and Unblock the Notifications