జగన్‌కు మెడనొప్పి: విభజన బిల్లుపై చర్చకు పార్టీ నో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మెడనొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన సమైక్య శంఖారావం యాత్ర వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీన ఆయన యాత్ర తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, మెడనొప్పి కారణంగా 18వ తేదీకి వాయిదా పడింది.
జగన్‌కు మెడనొప్పి రావడం వల్ల సమైక్య శంఖారావం యాత్రం ఒక రోజు వాయిదా పడినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి చెప్పారు. 18వ తేదీ నుంచి జగన్ సమైక్య శంఖారావం యాత్రను తిరిగి ప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం చెప్పారు.

రాష్ట్ర విభజన బిల్లుపై తాము శానససభలో జరుగుతున్న చర్చలో పాల్గొనబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. శాసనసభ్యులగా సభలో తమ అభిప్రాయాన్ని మాత్రమే చెబుతామని ఆయన అన్నారు. వైయస్ జగన్ ముఖ్యనేతలతో గురువారం సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
చర్చలో పాల్గొనకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విభజన అంశంపై రేపు జరిగే శాసనసభ సమావేశంలో ఓటింగు కోసం పట్టుబడుతామని ఆయన చెప్పారు. విభజన ప్రక్రియను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వారిద్దరూ శాసనసభకు వచ్చి బిల్లును సజావుగా వెనక్కి పంపేందుకు కుట్రలు చేస్తున్నారని భూమన అన్నారు. తిరుమల దైవసన్నిధికి వచ్చిన భక్తులపై టిటిడి కేసులు పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications