మోడీకి రివర్స్: కోర్టుకైనా సిద్ధం.. బిజెపికి జగన్ ఊహించని షాక్?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై మరోసారి పోరు సాగించనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు, బిజెపికి దగ్గరయ్యే సూచనలు కనిపిస్తుండటంతో జగన్ హోదా అంశాన్ని పక్కన పెట్టినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే, ఓ వైపు బిజెపికి అనుకూలంగా ఉంటూనే, ప్రత్యేక హోదా కోసం పోరు సాగించాలని జగన్ నిర్ణయించారు. రాజీనామాల విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని జగన్ నిర్ణయించారు.

జగన్ సూచన

జగన్ సూచన

విభజన హామీలు అమలు సహా ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని శనివారం జగన్ అధ్యక్షతన జరిగిన వైసిపి పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది.

రాజీనామాలపై వ్యూహాత్మకంగా..

రాజీనామాలపై వ్యూహాత్మకంగా..

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని గతంలో ప్రకటించిన జగన్ తాజాగా ఆ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హోదాపై ప్రయివేటు మెంబరు బిల్లు ఈ సమావేశంలో చర్చకు వచ్చేలా చూడాలని నిర్ణయించారు.

AP Special Status Making Implications to Modi
వారి వైఖరి బయటపడుతుందని.. కోర్టుకు

వారి వైఖరి బయటపడుతుందని.. కోర్టుకు

అలా చేస్తే గతంలో హోదాకు మద్దతు ఇచ్చిన పార్టీల ప్రస్తుత వైఖరి ఏమిటన్నదీ బయటపడుతుందని అనుకున్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా విషయంలో న్యాయం జరక్కపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జగన్‌తో సహా ఎంపీలంతా నిర్ణయించారు. అప్పటికీ కుదరకుంటే ఎంపీలు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు.

మోడీకి షాకే

మోడీకి షాకే

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతివ్వడం ద్వారా జగన్.. మోడీకి దగ్గరవుతున్నారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు పోరాటం, కోర్టుకు.. ఆ తర్వాత రాజీనామాలు చేయాలని నిర్ణయించడం ద్వారా బిజెపికి గట్టి ఝలక్ ఇచ్చినట్లే అంటున్నారు. కాగా, పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Saturday suggested Party MPS to fight for Special Status in Parliament. MPs ready to resign for Status if Central Government not ready to give.
Please Wait while comments are loading...