వారి వల్లే అవార్డులు, అయినా మరిచిపోతున్నారు: వైఎస్ జగన్
కాకినాడ: ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. యువభేరీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాకినాడ వెళ్తున్న సమయంలో బుధవారం బూరుగుపూడిలో ఆరోగ్య మిత్ర ఉద్యోగులు ఆయనను కలుసుకున్నారు.
తమ సమస్యలను వారు జగన్‌కు వివరించారు. ఆరోగ్య మిత్ర ఉద్యోగుల వల్లనే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిచిపోతోందని జగన్ విమర్శించారు ధైర్యంగా పోరాడాలని, ఆరోగ్య మిత్ర ఉద్యోగులకు తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగిస్తూ ప్రబుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త నియామకాలకు అనుమతిస్తూ జీవో 28ను జారీ చేసింది. దీంతో 13 జిల్లాల్లోని దాదాపు 7 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.
కాకినాడలో యువభేరీ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. అక్కడ విద్యార్తులను, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.












Click it and Unblock the Notifications