• search

చంద్రబాబు అలా చేస్తే ఎపికి ప్రత్యేక హోదా వస్తుంది: వైఎస్ జగన్

Subscribe to Oneindia Telugu
For guntur Updates
Allow Notification
For Daily Alerts
Keep youself updated with latest
guntur News

  గుంటూరు:ఎపికి ప్రత్యేక హోదా విషయమై టిడిపి, వైసిపిల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎపికి ప్రత్యేక హోదా రాకపోవడానికి మీరు కారణమంటే మీరే కారణమని ఆరోపణలు,ప్రత్యారోపణలు చేసుకుంటున్న అధికార , ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు హోదా రావాలంటే ఏం చెయ్యాలో ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నాయి.

  ఇదే క్రమంలో తాజాగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి టిడిపి ఏం చేస్తే రాష్ట్రానికి ప్రత్యే హోదా వస్తుందో చంద్రబాబుకు సూచించారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో ముగిసి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా బాపట్లలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ ఈ విషయమై మాట్లాడారు.

   బాపట్లలో...జగన్ బహిరంగ సభ

  బాపట్లలో...జగన్ బహిరంగ సభ

  110వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా బాపట్లకు చేరుకున్నజగన్ ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
  ఎపికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ "చంద్రబాబు గట్టిగా పోరాడి వుంటే ప్రత్యేకహోదా వచ్చేది...ఊసరవెళ్లిలా సీఎం రంగులు మారుస్తున్నారు...చంద్రబాబు నటనకు ఆస్కార్ వచ్చేది...ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం చెప్పిందానికి చంద్రబాబు గంగిరెద్దులా తల ఊపారు...13 ఆర్థికసంఘం ప్రత్యేకహోదా సిఫార్సు చేసింది...ఆ తరువాత 7 నెలలు గడిచినా చంద్రబాబు హోదా ఏందుకు సాధించలేదు?...అసలు ప్రత్యేకహోదాకు, 14 ఆర్థికసంఘంకు సంబంధమేంటి?...కేంద్రంలో మంత్రులను ఉపసంహరించి ఎన్డీయేలో సిగ్గు లేకుండా కొనసాగుతున్నారు?...అసెంబ్లీలో బీజేపీ నేతలు బాబును, బాబు బీజేపీ నేతలను ఒకరినొకరు పొగుడుకున్నారు." అని జగన్ మండిపడ్డారు.

  హోదా విషయంలో...చంద్ర బాబు డ్రామాలు

  హోదా విషయంలో...చంద్ర బాబు డ్రామాలు

  ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు డ్రామాలుడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు, ఆర్థిక సంఘానికి సంబంధంలేదని, 2014 మార్చిలో హోదాను కేబినెట్‌లో ఆమోదించిన వెంటనే ప్రణాళికా సంఘానికి ఆదేశాలు పంపారన్నారు. 2014 డిసెంబర్‌ వరకు 14వ ఆర్థిక సంఘం అమల్లో ఉందని అయినా చంద్రబాబు పట్టించుకోలేదని, హోదా గురించి ఆలోచించలేదన్నారు. హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని, ఢిల్లీ పెద్దలు చెప్పగానే చంద్రబాబు గంగిరెద్దులా తలూపారన్నారు. గతంలో అర్థరాత్రి ఏం చెప్పారో మొన్న కూడా అదే విషయాన్ని జైట్లీ చెప్పారని స్పష్టం చేశారు. నాలుగేళ్లు డ్రామాలు చేసిన చంద్రబాబు వైఎస్‌ఆర్‌సీపీ పోరాటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరించారని దుయ్యబట్టారు.

   అలా చేస్తే హోదా వస్తుంది...చంద్రబాబుకు సవాలు...

  అలా చేస్తే హోదా వస్తుంది...చంద్రబాబుకు సవాలు...

  "చంద్రబాబు అవిశ్వాసం పెట్టరు...వైసీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వరట...మొత్తం ఎంపీలు రాజీనామా చేస్తే దేశం మొత్తం మన వైపే చూస్తుంది. కేంద్రం దిగివచ్చి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తుంది. ఇప్పుడు చంద్రబాబును క్షమిస్తే ఇంటింటికి కేజీ బంగారు ఇస్తానని నమ్మిస్తారు...ఓటుకు 3 వేలు, 5 వేలు ఇస్తారు...ఆ డబ్బులు తీసుకొని మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి" అని జగన్ చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆయన చెప్పుకొచ్చారు. బాబు హైటెక్‌ పాలనలో ఫోన్‌ కొడితే మద్యం వస్తోందని జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో బెల్ట్‌ షాప్‌లేని గ్రామమే లేదన్నారు.

  రైతుల గురించి అబద్దాలు...నిరుద్యోగులను దగా...

  రైతుల గురించి అబద్దాలు...నిరుద్యోగులను దగా...

  "ఆక్వా, వరి, శనగ, మినుములు, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా వ్యవసాయం బాగుందని చంద్రబాబు అంటారు. ఉద్యోగాలు లేక యువకులు హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు వెళ్తూంటే వలస పోతుంటే 40 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇలా ఎవరు సంతోషంగా లేరు. ఇంటింటికీ ఉద్యోగం లేదా ఉపాధి, లేదా 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చేతులెత్తేసారు...నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన చూస్తున్నామని, అభివృద్ధి పేరుతో నోరు తెరిస్తే బాబు అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు.

  మరిన్ని గుంటూరు వార్తలుView All

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Guntur: Leader of the Opposition in Andhra Pradesh and YSRCP President YS Jagan Mohan Reddy's Praja Sankalpa Yatra reached to Guntur .The YSRCP chief addressed the public meeting at Bapatla. YS Jagan lashed out at Chief Minister N. Chandrababu Naidu over special status and his blatant lies and false promises.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more