కూటమి పై జగన్ బ్రహ్మాస్త్రం..అదే జరిగితే, ఇక..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి అవకాశం లేకుండా చేసే వ్యూహాలతో కూటమి పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ తిరిగి తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాల పైన జగన్ వరుసగా టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా తానే నిరసనల్లో పాల్గొనేలా డిసైడ్ అయ్యారు. మరో వైపు జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఫలితం పైన చర్చ మొదలైంది.

జగన్ కొత్త అస్త్రం
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల లండన్ పర్యటన తరువాత ఇక నుంచి పూర్తిగా పార్టీ వ్యవహారాలు.. ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు. ఈ రోజు.. రేపు నిర్వహించే పార్టీ సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముందుగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనను జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే వైసీపీ నిరసనలు నిర్వహించింది. కాగా, ఈ నెల 9న జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేరుగా సందర్శించేందుకు సిద్దమయ్యారు. జగన్ పర్యటన సక్సెస్ చేసేలా వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి రోడ్ షో చేస్తూ నర్సీపట్నం చేరుకోనున్నారు. మెడికల్ కాలేజీ వద్ద విద్యార్ధులు.. వారి తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు.

ys-jagan-to-announce-crucial-decision-in-his-narsipatnam-tour-on-9th-of-this-month

వరుస పోరాటాలు
ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన జగన్ మరోసారి కార్మికుల మధ్యకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. ప్రయివేటీకరణ పైన ఇంకా సందేహాలు తొలిగిపోలేదు. ఈ క్రమంలో జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. కార్మికులు చేసే పోరాటాలకు జగన్ మద్దతు ప్రకటించేందుకు సిద్దమయ్యారు. ఇక.. నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకార సంఘాలు నిరసనకు దిగాయి. వారితోనూ జగన్ భేటీ కానున్నారు. వారి పోరాటానికి జగన్ మద్దతు ప్రకటించనున్నారు. నర్సీపట్నం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజకవర్గం కాగా, నక్కపల్లి హోం మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావు పేట పరిధిలోది. దీంతో, ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్ పర్యటన పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

కీలక నిర్ణయం
ఇక.. ఈ పర్యటన ద్వారా జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలు.. స్టీల్ ప్లాంట్ వివాదం పైన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. లండన్ పర్యటనకు వెళ్తున్న జగన్.. తిరిగి వచ్చిన తరువాత మెడికల్ కాలేజీల పీపీపీ విధానంకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయి దీక్ష కు సిద్దం అయ్యారు. నంద్యాల లేదా రాజమండ్రి వేదికగా ఈ దీక్ష చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా విశాఖలో భారీ సభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు నర్సీపట్నం పర్యటనలో జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా పార్టీ సమీక్షలకు జగన్ నిర్ణయించారు. క్షేత్ర స్థాయిలో మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా జగన్.. ఇక కూటమి పైన కొత్త అస్త్రాలను సంధించటానికి సిద్దమయ్యారు. ఇప్పుడు జగన్ తాజా నిర్ణయాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+