• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవెంట్ మేనేజ్మెంట్ లా జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన: నిమ్మల రామానాయుడు ధ్వజం

|
Google Oneindia TeluguNews

వరద ప్రభావిత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అంత ఈవెంట్ మేనేజ్మెంట్ లా సాగిందని ఆయన మండిపడ్డారు. ఏ గ్రామాలకు వెళ్లాలి? ఏ ఇళ్లకు వెళ్లాలి? ఎవరితో మాట్లాడాలి? అన్నది ముందే నిర్ణయించుకుని, ముందుగా మంత్రులు వాళ్ళ ఇంటికి వెళ్లి వారికి తర్ఫీదు ఇచ్చి, వాలంటీర్లను పెట్టి అదే విధంగా చెప్పాలి అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా పర్యటన సాగించారని నిమ్మల రామానాయుడు ఆరోపణలు గుప్పించారు.

కొడాలి నానీకి ఇబ్బందిగా మారిన చెత్తపన్ను.. పేర్ని నానీకి ఫోన్; జగన్ ను కలుస్తారట!!కొడాలి నానీకి ఇబ్బందిగా మారిన చెత్తపన్ను.. పేర్ని నానీకి ఫోన్; జగన్ ను కలుస్తారట!!

మొక్కుబడి పర్యటనగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన

మొక్కుబడి పర్యటనగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన

జగన్మోహన్ రెడ్డి పర్యటన అంతా మొక్కుబడి పర్యటనలా సాగింది తప్ప ఎక్కడా వరద బాధితులకు భరోసా ఇచ్చినట్టు గా కనిపించలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాను వారం రోజులు ముందు వస్తే ప్రజలు ఇబ్బంది పడే వారిని పేర్కొనడాన్ని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తప్పుబట్టారు. నాయకుడు ఎప్పుడైనా ఆపద సమయంలో ప్రజలను ముందుండి నడిపించాలని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో తిత్లీ తుఫాను, హుదూద్ తుఫాను వచ్చిన సందర్భంగా చంద్రబాబు అక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్ది తరువాతనే వెనుదిరిగి వెళ్లారని నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు.

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు

దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు


దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, జనజీవనం అతలాకుతలం అయితే తీరిగ్గా వచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగ వరద పర్యటన చేసి వెళ్ళారు అంటూ ఎద్దేవా చేశారు. వరదలు వస్తాయి అని తెలిసినా వరద సామాగ్రి కొనుగోలుకు టెండర్స్ పిలువ లేదని, వరదలు వివిధ ప్రాంతాలను ముంచెత్తుతాయి అని తెలిసిన ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం కాలేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు. కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని పాలకులు ఎందుకు అంటూ నిమ్మల రామానాయుడు విమర్శించారు.

పక్క తెలంగాణాలో వరద సాయం 10వేలు.. ఇక్కడ రెండు వేలా?

పక్క తెలంగాణాలో వరద సాయం 10వేలు.. ఇక్కడ రెండు వేలా?


జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని హడావుడిగా జగన్ పర్యటించిన గ్రామాలలో వారికి అరకొర సహాయాన్ని అందించారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వారం రోజుల పాటు జగన్ వరద ప్రభావిత ప్రాంతాల లోనే ఉండి పర్యటన చేస్తే ఆ సహాయం అందరికీ అందేదని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో వరదలో చిక్కుకున్న బాధితులకు సహాయంగా పదివేల రూపాయలు ఇస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అని, కార్డు లో ఒక వ్యక్తి ఉంటే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

విలీన మండలాల ఆందోళనలకు జగన్ కారణం

విలీన మండలాల ఆందోళనలకు జగన్ కారణం

విలీన మండలాల ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై వ్యతిరేకత రావడానికి ఇది కారణం కాదా అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన సమయంలో విలీన మండలాల్లో ప్రజల నుండి ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదని, కానీ ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళనలు చేశారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పోలవరం నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైన ఏపీ సర్కార్, పోలవరం నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వరదలతో రైతులు పంట నష్టపోతే కనీసం మాట కూడా మాట్లాడని జగన్


వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు కనీసం ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వలేకపోయారు అని, నష్టపరిహారం ఎంత ఇస్తామో కూడా చెప్పలేకపోయారని, రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చారు అని నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇప్పటికైనా నామమాత్రపు పర్యటనలు మానుకుని, వరద బాధితులకు నిజంగా సహాయం చేసే లాగా చర్యలు తీసుకోవాలని, తక్షణం వరద సహాయం అందించాలని, రైతులకు అండగా నిలవాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు.

English summary
Nimmala Ramanaidu criticized Jagan's visit to the flood-affected areas as a matter of event management..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X