గవర్నర్ బిశ్వభూషణ్ బదిలీ వేళ..రాజ్‌భవన్‌కు జగన్ దంపతులు..!!
ఛత్తీస్ గఢ్ గవర్నర్ గా బదిలీ అయిన బిశ్వభూషణ్ హరిచందన్ గౌరవార్థం ప్రభుత్వం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.
రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి, పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఏపీ గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. ఆయనతో పాటు మొత్తం 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ఇవ్వాళ నియమితులయ్యారు. వారి నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన అబ్దుల్ నజీర్ ఈ ఏడాది జనవరి 4వ తేదీన పదవీ విరమణ చేశారు.

కర్ణాటక నుంచి.. సుప్రీంకు..
జస్టిస్ ఎస్ ఏ నజీర్ స్వరాష్ట్రం కర్ణాటక. 1983లో బార్ కౌన్సిల్ లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు. కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎలివేట్ అయ్యారు. చరిత్రాత్మకమైన బాబ్రీమసీదు-రామజన్మభూ వివాదంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఏపీతో మొత్తం 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
గవర్నర్ కు జగన్ థ్యాంక్స్..
ఛత్తీస్ గఢ్ కు బదలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. దీనికి బిశ్వభూషణ్ తో కలిసి దిగిన ఫొటోను జత చేశారు. బిశ్వభూషణ్ తో కలిసి పని చేయడం తనకు గర్వకారణమని అన్నారు. ఆయన ఏపీకి అందించిన సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తోన్నానని అన్నారు.
వీడ్కోలు సభ..
కాగా- బిశ్వభూషణ్ హరిచందన్ గౌరవార్థం వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సోమవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ ఇది ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి హాజరు కానున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి- ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

ఛత్తీస్ గఢ్ గవర్నర్ మణిపూర్ కు..
ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ ఉయిక్యె.. మణిపూర్ కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భగత్ సింగ్ కోష్యారి స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ భైస్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కఠారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివప్రసాద్ శుక్లా, లడఖ్ లెప్టినెంట్ గవర్నర్‌గా బీడీ మిశ్రా, నాగాలాండ్ గవర్నర్‌గా గణేషన్, మేఘాలయ గవర్నర్‌గా ఫగు చౌహాన్, బిహార్ గవర్నర్‌గా విశ్వనాథ్ అర్లేకర్ అపాయింట్ అయ్యారు.












Click it and Unblock the Notifications