జగన్ కల నెరవేరదని సోమిరెడ్డి: కిరణ్‌పై కెటిఆర్ ధ్వజం

ప్రాజెక్టుల గురించి తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుసుకొని మాట్లాడాలన్నారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు 1975లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపనం చేశారన్నారు. కిరణ్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడే అన్నారు. చిత్తూరుకు నీటి తరలింపులో వెయ్యి కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. కండలేరు నుండి చిత్తూరుకు చుక్క నీరు కూడా తరలించేందుకు ఒప్పుకోమన్నారు. పైప్ లైన్ నిర్మాణం చేపడితే అడ్డుకుంటామన్నారు. తన విధానాలతో దేశంలోనే కాంగ్రెసు పార్టీ మాయమవుతోందని కోడెల శివ ప్రసాద్ అన్నారు.
కిరణ్ పైన కెటిఆర్ నిప్పులు
ముఖ్యమంత్రి పైన తెరాస ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదులో నిప్పులు చెరిగారు. కిరణ్ కళ్లుండి చూడలేని కబోది అన్నారు. మద్రాసు నుండి మీరు విడిపోయినప్పుడు ఆత్మగౌరవమంటారు.. ఇప్పుడు మేం విడిపోకూడదా అని ప్రశ్నించారు. గూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో ఎళా తీస్తారన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఎపి పుట్టక ముందే సాగర్ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు.
కిరణ్ ముఖ్యమంత్రి కుర్చీకి తగడన్నారు. ఆయనకు నైతికంగా కొనసాగే అర్హత లేదన్నారు. పెద్ద రాష్ట్రం కావాలని రచ్చబండలో చెప్పిన కిరణ్ మద్రాసు గురించి ఉద్యమించాలన్నారు. తెలుగును ఖనీ చేసిన కిరణ్‌ను మార్చమని తెలుగు తల్లి సోనియా వద్ద మొరపెట్టుకుందని ఎద్దేవా చేశారు. సిఎం చేసేదంతా పనికి మాలిన పనే అన్నారు. కిరణ్‌ది అభద్దాల పుక్కిటి పురాణమని ధ్వజమెత్తారు.
ఒకే వేదిక పైన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను కూర్చోబెట్టలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అన్నారు. కిరణ్ నిజంగా సమైక్యవాది అయితే ఆ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలన్నారు. తెలంగాణ రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకుండా మంత్రులు చూడాలన్నారు. కిరణ్ తన పదవిని, స్థాయిని మర్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. కిరణ్ ఇంటి పేరు నల్లారి, ఊరిపేరు కలిగిరి, ఆయన తీరు కిరికిరి అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications