YS Jagan: ఏపీలో పోలింగ్ పై వైఎస్ జగన్ ఫస్ట్ రియాక్షన్ ..! నెక్ట్స్ జరిగేది ఇదే...
ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇప్పటికే పోలింగ్ అనంతరం విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అధినేతలు చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, షర్మిల స్పందించగా.. వైఎస్ జగన్ మాత్రం మౌనంగా ఉండిపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో నిన్నటి పోలింగ్ పై సీఎం జగన్ సోషల్ మీడియా ద్వారా స్పందించిన జగన్... నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండను సైతం లెక్కచేయకుండా తనకు ఆశీస్సులు అందించేందుకు సునామీలా తరలి వచ్చారని పేర్కొన్నారు. అలాగే "ఈ సందర్భంగా నా అవ్వాతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీ యువకులందరికీ పేరుపేరునా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.

నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024
మన వైసీపీ కోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇస్తున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో సీఎం జగన్ కూడా పోలింగ్ పై స్పందించినట్లయింది. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ సరళిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ పోలింగ్ శాతాలు తేలితే కాస్త క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications