బేస్ లెస్.. సెన్స్ లెస్.. జగన్, భారతి సారీ చెప్పాల్సిందేనన్న షర్మిల..!

ఏపీలో గత ఎన్నికలకు ముందు నుంచీ ఆస్తుల విషయంలో సోదరుడు వైఎస్ జగన్, ఆయన భార్య భారతితో విభేదిస్తున్న పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. ఇప్పటికీ అవకాశం దొరికితే చాలు వారిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ పై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ షర్మిల కూడా ఘాటుగా స్పందించారు. అమరావతి వేశ్యల రాజధాని కామెంట్స్ మీద భారతి రెడ్డి, జగన్ బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

అమరావతి వేశ్యల రాజధాని డిమాండ్ పై వెంటనే మహిళలకు భారతి రెడ్డి,జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి అని, మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించారని నేరమని ఆమె తెలిపారు. వేశ్యల రాజధాని అనడం బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ అన్నారు.

ys Sharmila demands apology from ys jagan ys Bharati on Amaravati prostitutes capital remark

గత 10 ఏళ్లుగా రాజధాని లేదని, ఇలాంటి సమయంలో అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిది అన్నారు. వేశ్యల రాజధాని అనే వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఇలాంటి మాటలు క్షమించరానివన్నారు. ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలని షర్మిల తెలిపారు.

పార్టీ అయినా, మీడియా హౌజ్ అయినా క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. వైసీపీకి చెందిన సాక్షి చానెల్ లో ప్రసారం చేసినందుకు సాక్షి హౌజ్ క్షమాపణ చెప్పాలన్నారు. సాక్షి మీడియా హౌజ్ నడుపున్న భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని కోరారు. భారతి రెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. నామోషీ చెందాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. అలాగే జగన్ కూడా క్షమాపణ చెప్పాలన్నారు.

ys Sharmila demands apology from ys jagan ys Bharati on Amaravati prostitutes capital remark

మహిళల మనోభావాలు దెబ్బతీశారని, మహిళల మనోభావాలు దెబ్బతీసి నందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవన్నారు. ఇలాంటి వాక్యాల్లో వాస్తవం లేదన్నారు. అక్కడ వేశ్యలు కాదు.. అందరు ఉంటారు.. అన్ని వర్గాల వారు ఉంటారని గుర్తుచేశారు. ఇవి బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ కామెంట్స్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+