కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చెయ్యండి: ఉద్వేగంగా వైఎస్ షర్మిల

కడప లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన వైయస్ షర్మిల ప్రచార పర్వాన్ని దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన వై.ఎస్ షర్మిల నిత్యం అధికార వైసిపిని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలైన టిడిపి, బిజెపిలపైన కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రొద్దుటూరులో తన ఎన్నికల ప్రచారాన్ని సాగించిన వైయస్ షర్మిల మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్, చంద్రబాబుపై షర్మిల వ్యాఖ్యలు
న్యాయ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న షర్మిల ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్నారు. ఓవైపు చంద్రబాబు మోడీని ప్రేమిస్తుంటే, మరోవైపు జగన్ కూడా మోడీనే ప్రేమిస్తున్నాడని, మొత్తంగా మోడీ కోసం ఇద్దరు పాకులాడుతున్నారని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఇక బిజెపితో ఒకరు పొత్తుగా ఉంటే, ఇంకొకరు తొత్తుగా ఉన్నారని చంద్రబాబును, జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila emotional speech asked people to do justice

గొడ్డలి అవినాష్ కావాలా.. మీ వైయస్సార్ బిడ్డ కావాలా?
ఏపీ ప్రత్యేక హోదాతో పాటు, కడప స్టీల్ ప్లాంట్ ను తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు వైయస్ షర్మిల. కడప ఎంపీగా గొడ్డలి అవినాష్ రెడ్డి ఎన్నడైనా ప్రజలకు సేవ చేశాడా చెప్పాలని ప్రశ్నించారు. ఇక గొడ్డలి అవినాష్ కావాలా.. మీ వైయస్సార్ బిడ్డ కావాలా అని షర్మిల ప్రజలను ప్రశ్నించారు.

కొంగు చాచి అడుగుతున్నా .. ఉద్వేగంగా వైఎస్ షర్మిల
కొంగు చాచి అడుగుతున్న న్యాయం చేయండి అంటూ షర్మిల తనదైన శైలిలో ప్రజలతో ఉద్వేగంగా మాట్లాడారు. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని షర్మిల కోరారు. ప్రజా కోర్టులో న్యాయం కోసం జరుగుతున్న ఎన్నికలు కడప ఎన్నికలని పేర్కొన్న షర్మిల వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి ప్రజా కోర్టులో ఓటు ద్వారా శిక్ష వేయాలన్నారు.

జగన్ మోడీ వారసుడు
వైయస్సార్ తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి ఇంకా శిక్ష పడలేదు అంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏమిటని వైయస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ మోడీ వారసుడని వైయస్సార్ వారసుడు కాదని, వైసిపి ఇంత అవినీతిలో కూరుకుపోయినా బిజెపి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ బిజెపి తొత్తు కాబట్టే చర్యలు తీసుకోలేదన్నారు.

అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తనకు రావన్న షర్మిల
జగన్ ను చూసుకుని తెలంగాణ నేత కొండా రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని 1000 కోట్ల రూపాయలు తాను తీసుకున్నట్టు రుజువులు ఉంటే బయట పెట్టాలన్నారు వైఎస్ షర్మిల. అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదంటూ ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+