YS Sharmila పార్టీ జెండా ఖరారు..ఆ రంగుల వెనుక : రేవంత్ కు చెక్ .. మధ్యలో అలా : అన్న రూటులోనే....!!
తెలంగాణ రాజకీయాల్లోఈ నెల 7..8వ తేదీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 7వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ తెలంగాణలో కొత్త రాజకీయానికి తెర తీస్తున్నారు. ఇక, 8వ తేదీన రాజన్న రాజ్యం లక్ష్యమంటూ వైఎస్ షర్మిల తన పార్టీ జెండా..అజెండా ప్రకటించనున్నారు. ఒక రకంగా ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆసక్తి కర రాజకీయ పోరు సాగనుంది.

ఇద్దరికీ ఆ విషయంలో పోటీ..
ఇద్దరి లక్ష్యం కేసీఆర్. ఇక, రెడ్డి సామాజిక వర్గం..ఎస్సీ ఓటర్లునే ఈ ఇద్దరు తమతో కలిసి వస్తారని నమ్మకం పెట్టుకున్నారు. అదే సమయంలో వైఎస్సార్ తెలంగాణ వారసత్వం గురించి ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ లోనూ...న్యూట్రల్ గా ఉన్న వైఎస్సార్ అభిమానులను తనకు మద్దతుగా సమీకరించేందుకు షర్మిల.. వైఎస్ కాంగ్రెస్ లో చివరి వరకు ఉన్నారంటూ..వారి మద్దతు తనతోనే ఉండేలా రేవంత్ అప్పుడే డైలాగ్ వార్ మొదలు పెట్టేసారు. అయితే, ఏపీలో తండ్రి వారసత్వాన్ని కాంగ్రెస్ కు ఏ మాత్రం దక్కకుండా పూర్తిగా జగన్ తన వైపు లాగేసుకోవటంలో సక్సెస్ అయ్యారు.

తండ్రికి నివాళి..పార్టీ ప్రకటన..
ఇప్పుడు షర్మిల..తెలంగాణలోనూ అదే ప్రయత్నం చేస్తున్నారు. అందు కోసం తన పార్టీ జెండా నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక, షర్మిల ఈ నెల 8వ తేదీన ఉదయం ఇడుపుల పాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించి..అక్కడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లోని బేగంపేట చేరుకుంటారు. మధ్యాహ్నం పంజాగుట్ట సర్కిల్ లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి..పార్టీ నేతలతో కలిసి ఫిలింనగర్ లో ఉన్న జేఆర్సీ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడే తన పార్టీ ప్రకటనతో పాటుగా జెండా..అజెండా ప్రకటించనున్నారు. తెలంగాణ సమస్యలు.. పరిష్కార మార్గాలు..తన పాదయాత్ర గురించి షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

అన్న మార్గంలో..నాన్నకు వారసురాలిగా..
ఇక, పార్టీ జెండా ఆకట్టుకొనే విధంగా ఉండాలని తొలి నుండి షర్మిల చెబుతూ వచ్చారు. తన తండ్రి పేరుతోనే పార్టీ ఏర్పాటు చేస్తుండటంతో..జెండాలో వైఎస్సార్ చిత్రం డిజైన్ చేసారు. ఏపీలో అన్న జగన్ వైఎస్సార్సీపీ జెండాలో వైఎస్సార్ చిత్రం తో డిజైన్ చేసారు. ఇక, తననున వైఎస్ రాజకీయ వారసురాలిగా కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి సమాధానంగా తన పార్టీ పేరుతో పాటుగా జెండాలోనూ తన తండ్రి ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. అదే విధంగా విద్య-వైద్యం ఉచితమని ప్రకటన చేయబోతున్నారు.

జెండాలో రంగుల ఎంపిక వెనుక..
ఇక, వైఎస్సార్టీపీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో పాలపిట్ట రంగు 80%, నీలం రంగు 20% ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. ఇప్పటికే రాజకీయంగా తెలంగాణలో టార్గెట్ 2023 లో భాగంగా వ్యూహకర్తను షర్మిల సిద్దం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు ఏపీలో అన్న జగన్ ఏ రకంగా వ్యూహాలు..ప్రణాళికలు..ప్రచారం..పాదయాత్ర నిర్వహించారో...పూర్తిగా అదే మార్గంలో షర్మిల తెలంగాణలో రాజకీయంగా ప్రయాణం చేయటానికి సిద్దమయ్యారు. ఇక, తన మనసులోని మాటలతో పాటుగా..తన భవిష్యత్ ప్రణాళికలను ఈ నెల 8వ తేదీన షర్మిల వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications