జగనన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారు: చంద్రబాబు షాకింగ్ వ్యాఖ్యలు!!
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర స్థాయి పంచాయతి రాజ్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు దేశం పార్టి అథినేత చంద్రబాబు జగన్ తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకున్నారని, ఇప్పుడు మాపై పడుతున్నారని అన్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్ లో తిరుగుతున్నారని అన్నారు.
తన తల్లీ, చెల్లి వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధం అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏదో ఒక రకంగా ఇతరులపై బురద చల్లేసి బ్రతకటమూ రాజకీయమా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నాటికి వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను జనం ఇంటికి పరిమితం చెయ్యటం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడికో పోతాడని, కానీ రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి కేసులను సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలకు వాయిదా వేసిందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. "స్థానిక సుపరిపాలన ఆత్మ గౌరవం ఆత్మ విశ్వాసం" డిక్లరేషన్ ను టీడీపీ జనసేన కలిసి ప్రకటన చేస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన దీనిని అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసిందని తన పాలనా కాలంలో పంచాయతీయలకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని చంద్రబాబు ఆరోపించారు. 14, 15వ ఆర్ధిక సంఘాల ద్వారా పంచాయితీలకు విడుదల చేసిన దాదాపు 8,669 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు.

పంచాయితీల ఖజనాలో ఒక్క రూపాయి లేకుండా ప్రజోపయోగ పనులు చేసేందుకు సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. తమకు సేవ చేయటానికి ప్రజలు సర్పంచులను ఎన్నుకుంటే, తనకు సేవ చేయటానికి జగన్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని చెప్పారు. ప్రజా స్వామ్యం లో స్థానిక పాలన గౌరవాన్ని జగన్ తగ్గించారని చంద్రబాబు ఆగ్రహంవ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదని ఆయన పలు హామీలను ఇచ్చారు.












Click it and Unblock the Notifications