Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిగతావాళ్ళని కూడా నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్: భారతిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కడప రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. వైసిపికి, టిడిపి కూటమికి, కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంలో ప్రజలు ఎవరికి పట్టంకడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి ప్రయత్నం చేస్తున్న వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ, కాంగ్రెస్ శ్రేణులలో జోష్ ను పెంచుతున్నారు.

ప్రచారాన్ని హోరెత్తిస్తున్న వైఎస్ భారతి
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సరళి ఒక విధంగా ఉంటే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు కడప ఎంపీ స్థానంలో ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీతో గెలుస్తారు అన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. వైసిపి తరపున పులివెందులతో పాటు ఇతర నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ భారతి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

YS Sharmila serious comments on ys bharathi over her comments on ycp as single player

మీరే సింగిల్ ప్లేయర్ ..షర్మిల కౌంటర్
ఇక ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల కూడా వదిన తో పోటీపడి మరీ ప్రచారాన్ని చేస్తున్నారు తాజాగా ఇటీవల ప్రచారంలో భారతి చేసిన వ్యాఖ్యలపైన విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నే సింగిల్ ప్లేయర్ అంటూ భారతి చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. గొడ్డలితో వైయస్ వివేకానంద రెడ్డిని నరికేసినట్టు మిగతావాళ్ళని కూడా నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అంటూ వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు.

అవినాష్ రెడ్డిపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
ఇదే సమయంలో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైయస్ షర్మిల. ఓటమిపై తో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. దీనికోసం పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నాడని పేర్కొన్న షర్మిల వ్యాఖ్యలు చేశారు.

భారతి స్ట్రాటజీ ఇదేనా : షర్మిల ఫైర్
ఏపీలో వాళ్లే అధికారంలో ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారని ఇక వాళ్లే అధికారంలో ఉండాలి అనుకున్నప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరినీ నరికేయాలి అంటూ పేర్కొన్నారు. భారతి స్ట్రాటజీ ఇదేనా అంటూ వైయస్ షర్మిల ప్రశ్నించారు ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటేయాలని, ఎంపీని జైలులో కలవాలి అనుకుంటే అవినాష్ రెడ్డికి ఓటేయాలని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఈసారి కడప బిడ్డలు ఆలోచన చేయాలని పేర్కొన్న షర్మిల నేరాలు చేసిన వారికి అవకాశం ఇవ్వకూడదు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+