వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియల రిసెప్షన్ నేడే.. హాజరుకానున్న ప్రముఖులు వీరే!!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక నేడు హైదరాబాద్లో వీరిద్దరి వివాహానికి సంబంధించి రిసెప్షన్ వేడుక జరగనుంది. హైదరాబాద్ శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో గ్రాండ్ గా ఈ వేడుక జరగనుంది.
ఈ వేడుకకు చాలామంది రాజకీయ, సినీరంగ ప్రముఖుల హాజరవుతారని సమాచారం. హైదరాబాద్ వేదికగా జరగనున్న వైయస్ రాజారెడ్డి అట్లూరి ప్రియల రిసెప్షన్ వేడుకకు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరుకానున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితరులు హాజరుకానున్నట్లు సమాచారం. ఒకపక్క కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలు కొనసాగిస్తూనే మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో, వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తున్నారు వైయస్ షర్మిల.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీఎం జగన్ పై వైయస్ షర్మిల చేస్తున్న పోరాట ఫలితంగా, షర్మిల కుమారుడి వివాహానికి, షర్మిల అన్న ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఇక నేడు రిసెప్షన్ కి కూడా సీఎం జగన్ దూరంగా ఉంటారని సమాచారం. కాగా అట్లూరి ప్రియతో షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగింది.

రాజస్థాన్ లోని జోధ్ పూర్ ప్యాలెస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం మొదట వివాహం వైభవంగా జరిగింది. ఆపై 18వ తేదీన క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఇక నేడు రిసెప్షన్ వేడుక భాగ్యనగరం కేంద్రంగా ఘనంగా జరుగుతుంది.












Click it and Unblock the Notifications