జగన్ ఘోర ఓటమి ఇందుకే.. చంద్రబాబుకు హెచ్చరిక!

ఏపీలో వైఎస్ షర్మిల వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విత్తనాల కొరతపై కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. దీంతో మళ్ళీ వైఎస్ షర్మిల అచ్చెన్నాయుడుపై విరుచుకుపడింది. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదిగా ఉందని షర్మిల పేర్కొన్నారు.

అచ్చెన్న పై షర్మిల ఫైర్
సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా ? అంటూ షర్మిల నిలదీశారు. పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా ? అంటూ ప్రశ్నించారు. సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా ? అంటూ అసహనం వ్యక్తం చేశారు షర్మిల.

ys sharmila targets ys jagan along with chandrababu govt over farmers problems

సంక్షోభం నుంచి సంక్షేమం అంటే ఇదేనా
రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ NDA ప్రభుత్వ కట్టుబడి ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు ! అంటూ ఎద్దేవా చేశారు. రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారని షర్మిల మండిపడ్డారు.

జగన్ గారు నిండా ముంచారు.. అందుకే 11సీట్లకు పరిమితం అయ్యారు
YCP ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా... మీకు పట్టం కట్టింది అంటూ అసహనం వెళ్ళగక్కిన షర్మిల జగన్ గారు నిండా ముంచారు అనే కదా 11సీట్లకు పరిమితం చేసింది. మోసం చేశారు అనే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. రైతు అడిగింది ఇవ్వాలని హక్కుగా మేము ప్రశ్నిస్తే ... రెచ్చ గొట్టినట్లు ఎలా అవుతుందో , వ్యవసాయ శాఖ మంత్రిగారు సమాధానం చెప్పాలన్నారు.

రైతులను వర్షంలో నిలబెట్టారు.. మీకిది న్యాయమా
రైతులను వ్యతిరేకించే బీజేపీ తో మీరు కూటమి కట్టి, పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కి, ఇప్పుడు వాళ్లను వర్షంలో నిలబెట్టారు అంటూ షర్మిల నిప్పుల వర్షం కురిపించారు. ఇది మీ సర్కారుకి న్యాయమా ? అని నిలదీశారు. జగన్ ఓటమిని గుర్తు చేసి చంద్రబాబును హెచ్చరించారు. నాట్లు వేసిన 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని జేజీఎల్ - 384 రకం విత్తనాలను కావాలని అడగడం రైతులు చేసిన పాపం అంటారా మంత్రిగారు అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+