జగన్ వ్యూహం: వైయస్ విజయమ్మ మళ్లీ యాక్టివ్

వైయస్ జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె చురుకైన పాత్ర నిర్వహించారు. కూతురు వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మ ఆ సమయంలో పార్టీకి దిక్కుగా మారారు. ఎన్నికల తర్వాత వారిద్దరు కూడా పార్టీకి దూరమైనట్లు కనిపించారు. వైయస్ జగన్ వారిని దూరం పెట్టారని గిట్టనివారు ప్రచారం కూడా చేశారు.
శాసనసభ సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ పార్టీ కమిటీలను పునర్వ్యస్థీకరించారు. తనకు సొంతానికి ఇద్దరు రాజకీయ కార్యదర్శులను నియమించుకున్నారు. సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డిని పూర్తి స్థాయిలో రాజకీయాలకు వినియోగించుకునేందుకు తన రాజకీయ కార్యదర్శిగా నియమించుకున్నారు.
అదే సమయంలో వైయస్ విజయమ్మ మరోసారి పార్టీ సమావేశంలో కనిపించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ, తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యే క్రమంలోనే వైయస్ విజయమ్మను మళ్లీ తెర మీదికి తెస్తున్నట్లు చెబుతున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాల్లో గౌరవాధ్యక్షురాలిగా ఇక ముందు కూడా చురుకైన పాత్ర పోషిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications