వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడని, ఆ లోటు ఎవరూ తీర్చలేరు: విజయమ్మ కంటతడి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. ప్లీనరీ వేదికపై ఆమె మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆదివారం ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. ప్లీనరీ వేదికపై ఆమె మాట్లాడారు.

చదవండి: చంద్రబాబు దుమ్ముదులిపిన షర్మిల

వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటును తనకు ఎవరూ తీర్చలేరని, కానీ జగన్‌కు మీ అందరి ఆశీస్సులను తాను కోరుకుంటున్నానని చెప్పారు. నాయకుడు అనేవాడు ప్రజల మనసులను చదవాలని, వారి గుండె చప్పుడులో ఉండాలన్నారు.

చదవండి: లక్ష్మీపార్వతి ఉద్వేగ ప్రసంగం

వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటు తమ కుటుంబంతో పాటు, ప్రజల్లోను కనిపిస్తోందని విజయమ్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైయస్ మంచివారని, జగన్ మంచివారని, పార్టీ పెట్టిన తర్వాత చెడ్డవారు అయిపోయారన్నారు. వైయస్ మృతి తర్వాత పరిణామాలు మారిపోయాయన్నారు.

నా బిడ్డను జైల్లో పెట్టారు

నా బిడ్డను జైల్లో పెట్టారు

సందర్భం వచ్చింది కాబట్టి మీతో విషయాలు పంచుకుంటున్నానని విజయమ్మ అన్నారు. ఇచ్చిన మాట కోసం జగన్ యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదని, టిడిపి - కాంగ్రెస్ కలిసి అబద్దపు కేసులు పెట్టాయన్నారు. కేసుల విచారణ అంటూ 16 నెలలు తన బిడ్డను జైల్లో ఉంచారని భావోద్వేగానికి లోనయ్యారు. జగన్ అసెంబ్లీలో, బయట ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పారు.

Recommended Video

Nagarjuna Akkineni to Join YSRCP? Breaking News!
నా బిడ్డ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడని బాధపడతా కానీ

నా బిడ్డ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడని బాధపడతా కానీ

ఒక్కోసారి నా బిడ్డ ఎందుకు ఇలా రాజకీయాల్లోకి వచ్చాడా అని బాధ వచ్చినా, ప్రజలు గుర్తుకు వచ్చి.. వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందని భావించి దుఖాన్ని దిగమింగుకుంటున్నానని విజయమ్మ చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

వైయస్ లేని లోటు నాకు తీర్చలేరు

వైయస్ లేని లోటు నాకు తీర్చలేరు

ఈ మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తాను మొదటి ప్లీనరీలోనే జగన్‌ను మీకు (ప్రజలకు) అప్పగించానని, అప్పటి నుంచి ప్రజల కోసం పోరాడుతున్నారని, అసెంబ్లీలో, బయట తన వాణి వినినిపిస్తున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేని లోటును తనకు ఎవరూ తీర్చలేరని, కానీ జగన్‌కు మీ అందరి ఆశీస్సులను తాను కోరుకుంటున్నానని చెప్పారు.

చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా..

చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా..

చంద్రబాబు నాయుడు తలకిందులుగా తపస్సు చేసినా ప్రజల గుండెల్లో చోటు సంపాదించలేరని విజయమ్మ అన్నారు. పార్టీ కోసం అంతా కష్టపడాలని, జగన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీలో ఏ ఒక్కరిని జగన్ దూరం చేసుకోరని, మాట ఇస్తే తప్పుకునే కుటుంబం తమది కాదని అన్నారు. రాబోయే యుద్ధం కోసం ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్లుగా భావించి రాజన్న స్వర్ణయుగం తీసుకు రావాలన్నారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma's emotional speech in YSRCP plenary on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X