షర్మిల విషయంలో భావోద్వేగంలో విజయమ్మ ... ఆడపిల్లల గౌరవం రాజకీయాల కోసం తాకట్టు పెడతారా?
ఆడపిల్ల ఎక్కడైనా ఆడపిల్లనే . అభిమాన భంగం కలిగితే ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఆడపిల్ల అయినా ఆవేదనకు గురవుతుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సోదరిగా , అన్నకు బాసటగా నిలిచిన వైఎస్ షర్మిల తో ప్రభాస్ కు సంబంధం ఉందని, లింకులు పెట్టి సోషల్ మీడియా లో చేసిన అసత్య ప్రచారం ..అసభ్యకర విధానం అటు షర్మిలనే కాదు షర్మిల తల్లి విజయమ్మనుకూడా మానసిక వేదనకు గురి చేసింది .

షర్మిల ప్రస్తావన రాగానే భావోద్వేగానికి గురైన విజయమ్మ
ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో విజయమ్మ షర్మిల ప్రస్తావన రాగానే భావోద్వేగానికి గురయ్యారు. ఆడపిల్లల గౌరవ భంగం కలిగించే నీచ రాజకీయాలపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. షర్మిల కు సంబంధించిన దుష్ప్రచారం బాలకృష్ణ ఇంటి నుండే జరిగిందని తెలిసి చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ఇంతకంటే నీచం , హేయం ఇంకేదైనా ఉంటుందా అని ఆమె మండిపడ్డారు .

ఆడపిల్లల గౌరవం పణంగా పెట్టి రాజకీయాలు చెయ్యాలా అని మండిపాటు
ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆడపిల్లల గౌరవాన్ని పణంగా పెట్టి రాజకీయాలు చెయ్యాలనుకునే రకం చంద్రబాబు అని విజయమ్మ ఆవేదనతో చెప్పారు. ఆడపిల్లల గౌరవం అనే విషయం కూడా అర్ధం కాని, మానవత్వం లేని రాజకీయాలను చేసే చంద్రబాబు ఎంతకైనా దిగాజారతారని విజయమ్మ ఉద్వేగంగా చెప్పారు. కేవలం రాజకీయాల కోసమే షర్మిల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని విజయమ్మ తెలిపారు.

ఇంతకంటే హేయమైన చర్య ఉంటుందా అని ప్రశ్నించిన విజయమ్మ
చాలా కాలంపాటు జరిగిన దుష్ప్రచారం భరించలేక షర్మిల పోలీసులను ఆశ్రయించటం , సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ లపై ఫిర్యాదు చెయ్యటం జరిగింది. ఈ వ్యవహారంలో షర్మిల తీవ్ర మనస్తాపానికి గురైందని విజయమ్మ చెప్పారు.రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇంత నీచానికి దిగజారటం అవసరమా అని విజయమ్మ ప్రశ్నించారు .












Click it and Unblock the Notifications