16న కీలక మలుపు తిరగనున్న వైఎస్ వివేకా హత్యకేసు

వైఎస్ వివేకా హత్యకేసు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు మార్చిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ2గా ఉన్న వై.సునీల్‌ యాదవ్‌ ఈనెల ఆరోతేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 16వ తేదీన దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసును ఇటీవలే సుప్రీంకోర్టు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్‌ సీహెచ్‌ సుమలత ధర్మాసనం ఎదుట విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా సునీల్‌యాదవ్‌ సహా నిందితులంతా సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.

కడప జైలు నుంచి చంచల్‌గూడ జైలుకు నిందితులను తరలించాలని కోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, బెయిల్ మంజూరు చేయాలంటూ సునీల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన కాణిపాకంలో తన సోదరుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరాడు.

ys vivekananda reddy murder case updates

వైఎస్ వివేకా హత్యకేసు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు మార్చిన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అధికారులు నాలుగు గంటలకు పైగా విచారించి ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాకు తెలిపారు. విచారణలో తాను చెప్పిన విషయాలను వక్రీకరించకూడదనే ఉద్దేశంతోనే న్యాయవాది సమక్షంలో విచారించాలని కోరానని, అందుకు అధికారులు అంగీకరించలేదని వెల్లడించారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా దర్యాప్తు కోసం వచ్చిన రాంసింగ్ బృందం అవినాష్ ను విచారించింది. నలుగురు సభ్యుల ఈ బృందంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. కొంతమంది దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, విచారణలో సీబీఐకి సహకరిస్తానని, తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులతో పంచుకున్నట్లు తెలిపారు. విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని కోరగా అధికారులు అంగీకరించలేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+