వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్సార్ చేయూత .. రెండో ఏడు కూడా , వైఎస్ జగన్ చేతుల మీదుగా పేద మహిళల అకౌంట్లలో నగదు జమ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పిన జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు పథకాల విషయంలో మాత్రం ఏ రకంగానూ కాంప్రమైజ్ కావడం లేదు.

జగన్ చందమామ అందరికీ తెలుసు.. మెంటల్ చంద్రబాబు, లోకేష్ లకే : రోజా ధ్వజంజగన్ చందమామ అందరికీ తెలుసు.. మెంటల్ చంద్రబాబు, లోకేష్ లకే : రోజా ధ్వజం

 నేడు రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం అమలు

నేడు రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం అమలు

ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ చేయూత పథకం కింద రెండవ ఏడాది లబ్ధిదారులకు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా నగదు బదిలీ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారులు అయిన మహిళల ఖాతాలలో నేరుగా డబ్బులను జమ చేయనున్నారు. వైయస్సార్ చేయూత పథకం కింద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారికి ఆర్థిక సహాయం అందిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండవ ఏడాది కూడా 23,14,372 మంది అర్హులైన మహిళలకు 4339.39 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయనున్నారు.

నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చెయ్యనున్న సీఎం జగన్

నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చెయ్యనున్న సీఎం జగన్

ఈ సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి నేడు ఆ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మొత్తం 8943.52 కోట్ల రూపాయల సహాయం వైయస్సార్ చేయూత పథకం కింద అందించింది. మొత్తం పేద మహిళలకు నాలుగు సంవత్సరాలలో దాదాపు 19 వేల కోట్ల సహాయం అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం రెండవ ఏడాది కూడా సక్సెస్ చేయాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

ఎన్నికల హామీలైన పథకాలను ఎన్ని ఇబ్బందులు ఉన్నా నెరవేరుస్తున్న జగన్

ఎన్నికల హామీలైన పథకాలను ఎన్ని ఇబ్బందులు ఉన్నా నెరవేరుస్తున్న జగన్

వైయస్సార్ చేయూత పథకం కింద 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద మహిళలకు ప్రతియేటా 18750 రూపాయల చొప్పున వరుసగా నాలుగేళ్లలో మొత్తం 75 వేల ఆర్థిక సహాయం చేయనున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలు అమలు లో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. కరోనా సంక్షేమ సమయంలో కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తున్న వైయస్ జగన్ నిర్ణయం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేడు సీఎం రెండు ఏడాది కూడా వైయస్సార్ చేయూత లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.

Recommended Video

AP Curfew Restrictions Eased | Oneindia Telugu

English summary
AP CM Jagan mohan reddy going to give second year the ysr Cheyutha scheme. Chief Minister YS Jaganmohan Reddy will press the button and deposit the money directly in the accounts of the women beneficiaries. YS Jaganmohan Reddy, who has been providing financial assistance to women to achieve financial self-sufficiency under the YSR cheyutha scheme, will also provide financial assistance of Rs 4339.39 crore to 23,14,372 eligible women for the second year in a row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X