కొత్తదారి: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ వ్యంగ్యాస్త్రం
విశాఖపట్నం: నోటుకు ఓటు, ట్యాపింగ్ వ్యవహారాలపై రెండు రోజుల్లో మాట్లాడుతానని ట్వీట్ చేసిన జనసేన అధినేత, తెలుగు సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆయన మేధావి తనానికి అద్దం పడుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గుడివాడ అమర్నాథ్, ప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ దేనిమీద ప్రశ్నిస్తారో తెలియని పరిస్తితి నెలకొని ఉందని వారన్నారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏడాది కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నిసార్లు ప్రశ్నించారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన ట్విట్టర్ వ్యాఖ్యల్లో సమాజం కోసం తాపత్రయం కనిపించడం లేదన వారన్నారు.

అభిమానులను అడ్డం పెట్టుకుని ప్రపంచంలో ఏ నటుడు కూడా చేయనంత అవినీతి చేస్తున్నారని వారు ఆరోపించారు. అభిమానులను ఎరగా వేసి టిడిపి, బిజెపి కూటమికి ఓట్లు వేయించి డబ్బులు సంపాదించారని అన్నారు. ట్విట్టర్ పోస్టుల్లో డబ్బులు వస్తాయని పవన్ కళ్యాణ్ కొత్తదారి కనిపెట్టారని వారు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications