జగన్ పార్టీ నేత అనుమానాస్పద మృతి
అనంతపురం: అనుమానాస్పద స్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు మృతి చెందారు. లక్ష్మన్న అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం గుత్తి రోడ్డులోని సోములదొడ్డి ప్రాంతంలో విగతజీవిగా కనిపించాడు.
అతని భార్య ఆదెమ్మ పామురాయిలో వార్డు మెంబర్‌గా పని చేస్తున్నాడు. గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మన్న చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని మృతి పైన అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు.
బాణా సంచాపేలి నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం మరువాడలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకెళితే.. మరువాడ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కేంద్రంలో ఆదివారం పెద్దఎత్తున పేలుడు సంభవించింది.
ఈ పేలుడు ధాటికి స్థానిక ప్రజలు సైతం తీవ్ర భయాంధోళనకు గురై తమతమ ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ పేలుడు ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications