గుడివాడలో వైసిపికి ఎదురు దెబ్బ
విజయవాడ: అధికార పార్టీ దెబ్బకు వైసీపీ కుదేలవుతోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా గుడవాడలో వైసీపీకి గడ్డి ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, తొమ్మిది మంది కౌన్సిలర్లు సహా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో గుడివాడ పురపాలక కౌన్సిల్ సైతం టీడీపీ కైవసం అవుతుందని ఆ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం మునిసిపాలిటీలో వైసీపీకి 20, టీడీపీకి 15 మంది సభ్యుల బలం ఉండగా, టీడీపీ బలం 25 కు పెరిగింది. అనంతరం మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ త్వరలో కృష్ణాజిల్లాలో వైసీపీ దుకాణం మూతపడుతుందని అన్నారు. జిల్లాకు చెందిన మరో ముగ్గురు వైసీపీ ముఖ్యనేతలు తమతో టచ్లో ఉన్నారని మంత్రి అన్నారు. వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరు, మాట్లాడుతున్న భాషకు చెంపపెట్టుగా ఇవాల గుడివాడ వర్గంలోని మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు టీడీపీలో చేరడం శుభసూచకమని ఆయన అన్నారు. వైసీపీకి చెందిన గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ యలపర్తి శ్రీనివాసరావు ఆదివారం టీడీపీలో చేరారు. వైసీపీ ఒంటెద్దు పోకడలు, వ్యవహారశైలి నచ్చకే బయటకు వచ్చానని టీడీపీ లో చేరిన యలపర్తి చెప్పారు.












Click it and Unblock the Notifications